రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే?
దిశ, వెబ్‌డెస్క్ : తరచూ అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. కొందరు రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని, మరికొందరికి దాహం వేసినా, వేయకపోయినా.. గంట గంటకు నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. ఇంతకీ మన శరీరానికి ఎన్ని లీటర్ల నీళ్లు అవసరమవుతాయి? అంటే.. దానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్మూలా లేదు. అది మనం చేసే శారరీక శ్రమ, వయసు, జెండర్‌ను బట్టి మారుతుంటుంది. సాధారణంగా శ్వాసించడం, చెమట, మూత్రం […]
దిశ, వెబ్‌డెస్క్ :
తరచూ అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. కొందరు రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని, మరికొందరికి దాహం వేసినా, వేయకపోయినా.. గంట గంటకు నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. ఇంతకీ మన శరీరానికి ఎన్ని లీటర్ల నీళ్లు అవసరమవుతాయి? అంటే.. దానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్మూలా లేదు. అది మనం చేసే శారరీక శ్రమ, వయసు, జెండర్‌ను బట్టి మారుతుంటుంది.
సాధారణంగా శ్వాసించడం, చెమట, మూత్రం రూపంలో శరీరంలోని వాటర్ కంటెంట్‌ను కోల్పోతుంటాం. ఆ నీటిని భర్తీ చేయడానికి సరిపడా వాటర్ తాగాల్సి ఉంటుంది. నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుత కాలాతీత మార్పుల వల్ల ఓ వ్యక్తి సగటున రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే..
పురుషులు – 15.5 కప్పులు (3.7 లీటర్లు )
మహిళలు – 11.5 కప్పులు (2.7లీటర్లు)
ఇతర ఫ్లూయిడ్స్, బేవరేజెస్, ఫుడ్ అన్నీ కలుపుకునే ఈ మొత్తంలో నీళ్లు తాగితే చాలని వెల్లడించింది. ఫుడ్, ఇతర డ్రింక్స్ ద్వారానే శరీరానికి దాదాపు 20 శాతం డైలీ ఫ్లూయిడ్ ఇన్‌టేక్ సప్లయ్ అవుతుంది. రోజుకు 8 గ్లాసుల వాటర్ అనే సూత్రం అందరికీ వర్తించదు. కొందరు ఏసీ రూముల్లో గడుపుతారు, ఫిజికల్ యాక్టివిటీ కూడా పెద్దగా ఉండదు. అలాంటి వారికి 8 గ్లాసుల వాటర్ సరిపోతుంది. కానీ ఎండలో పనిచేసే వారికి, శారీరక శ్రమకు గురయ్యేవారికి అంతకన్నా మించి నీళ్లు తాగితేనే ఉత్తమం. లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది.
వాటి ప్రభావం :
ఫిజికల్ యాక్టివిటీ, వర్క్‌వుట్స్ చేస్తే చెమట రూపంలో శరీరం అధిక నీటిని కోల్పోతుంది. అలాంటి టైమ్‌లో నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. కోల్పోయిన మినరల్స్ మళ్లీ శరీరానికి అందాలంటే.. స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా నేచురల్ డ్రింక్స్ తాగాలి. హాట్, హుమిడ్ వెదర్‌లోనూ బాడీకి నీటి అవసరం ఎక్కువ. ప్రెగ్నెంట్ వుమన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వుమన్స్ అయితే.. కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా నీళ్లు ఎక్కువగా తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.