తెలంగాణలో ఎంతమందికి వ్యాక్సిన్ వేశారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంటే, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే ముందున్న కర్తవ్యమని కొవిషీల్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. భారత్ బయోటెక్ నెలకు 7 కోట్ల కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ నెలకు 6 కోట్ల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన రుణాలతో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేపనిలో ఆయా కంపెనీలు పడ్డాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో వారి వారి వ్యాక్సిన్ ఫార్ములాలను వేరే కంపెనీలకు ఇచ్చేందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంటే, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే ముందున్న కర్తవ్యమని కొవిషీల్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. భారత్ బయోటెక్ నెలకు 7 కోట్ల కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ నెలకు 6 కోట్ల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన రుణాలతో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేపనిలో ఆయా కంపెనీలు పడ్డాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో వారి వారి వ్యాక్సిన్ ఫార్ములాలను వేరే కంపెనీలకు ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డాయి. అయితే తెలంగాణలో వ్యాక్సిన్ కొరతతో వ్యాక్సినేషన్ నిలివేశారు. ఈ మధ్య మళ్లీ కేసీఆర్ సర్కార్ కరోనా వ్యాక్సినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఈరోజు హెల్త్ కేర్ వర్కర్ల (హెచ్‌సీడబ్యూ)కు మొదటి డోస్ 381 మందికి వేయగా రెండవ డోస్ 143 మందికి వేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ)కు మొదటి డోస్ 1,046 మందికి వేయగా రెండవ డోస్ 112 మందికి వేశారు. 45 సంవత్సరాలు పైబడి వారికి మొదటి డోస్ 24,321 మందికి వేయగా, రెండవ డోస్ 12,355 మందికి వేశారు. ఇటీవలే 18 సంవత్సరాలు పైబడివారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 18 సంవత్సరాలు నిండి వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు 18-44 సంవత్సరాల లోపు వయసు వారికి మొదటి డోసు 1,28,460 వేశారు.
ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం హెచ్‌సీడబ్యూ లకు మొదటి డోస్ 2,48,218 మందికి వేయగా, రెండవ డోస్ 19,505 మందికి వేశారు. ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ లకు మొదటి డోస్ 2,54,651 మందికి వేయగా, రెండవ డోస్ 98,704 మందికి వేశారు. 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మొదటి డోస్ 40,86,635 మందికి వేయగా, రెండవ డోస్ 11,59,527 మందికి వేశారు. దీనితో పాటు 18-44 సంవత్సరాల లోపు వయసు వారికి మొదటి డోస్ 8,23,875 మందికి వేసినట్లు అధికారులు వెల్లడించారు.