బాల్కనీల్లో నవ జీవనం

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్.. ప్రజల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. లాక్డౌన్ ముందు వరకు ఒక లైఫ్ స్టైల్ ఉండేది.. ఇప్పుడు మరో లైఫ్ స్టైల్ కు ప్రజలు అలవాటు పడ్డారు. అందులోనూ ఎప్పుడో ఓ సారి బాల్కనీ వైపు తొంగి చూసేవారు. ఇప్పుడు బాల్కనీల్లోనే కాలం గడుపుతున్నారు. లాక్డౌన్ లో హైదరాబాద్ నగర ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో హైదరాబాద్ లోని అర్బన్ ల్యాబ్స్ లో పనిచేసే శ్రీయ అందమైన డ్రాయింగ్ లతో […]

Update: 2020-05-09 04:21 GMT

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్.. ప్రజల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. లాక్డౌన్ ముందు వరకు ఒక లైఫ్ స్టైల్ ఉండేది.. ఇప్పుడు మరో లైఫ్ స్టైల్ కు ప్రజలు అలవాటు పడ్డారు. అందులోనూ ఎప్పుడో ఓ సారి బాల్కనీ వైపు తొంగి చూసేవారు. ఇప్పుడు బాల్కనీల్లోనే కాలం గడుపుతున్నారు. లాక్డౌన్ లో హైదరాబాద్ నగర ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో హైదరాబాద్ లోని అర్బన్ ల్యాబ్స్ లో పనిచేసే శ్రీయ అందమైన డ్రాయింగ్ లతో వివరించింది.

భాగ్యనగర ప్రజలు ఇప్పుడు బాల్కనీల్లో జీవిస్తున్నారని శ్రీయ అంటోంది. ‘లాక్డౌన్ కు ముందు నేను మా బాల్కనీ నుంచి మా ఎదుటి అపార్ట్ మెంట్ వైపు చూస్తే.. ఓ ఆంటీ ఉదయాన్నే తలంటు స్నానం చేసి, చక్కని చీర కట్టుకుని తులసీ చెట్టు ముందు పూజ చేసేది. అంకుల్ బాల్కనీలో పేపర్ చదుకునే వారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాకా… ఆంటీ ఆ చెట్టు ముందర కనిపించడం లేదు. అంకుల్ బాల్కనీలో కాఫీ తాగుతూ.. నెట్ బ్రౌజ్ చేస్తూ కూర్చుంటున్నారు. ఆ ఒక్క ఫ్యామిలీ అనే కాదు.. భాగ్యనగర ప్రజల నుంచి పల్లెటూళ్ల వరకు అందరూ బాల్కనీలు, టెర్రస్ లపైనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారని ఆమె చెబుతోంది.

వీధులన్నీ నిర్మానుష్యం :

‘లాక్డౌన్ కు ముందు వీధులన్నీ సందడిగా ఉండేవి. జనాలంతా హడావిడిగా తిరిగేవారు. పిల్లలు సంతోషంగా ఆడుకునేవారు. కాలనీవాసులు వీధి వెంట వెళుతుంటే.. కూరగాయాలు అమ్మేవాళ్లు, పూల కొట్టువాళ్లు, కిరాణా షాపు అంకుల్.. ఇలా చాలామంది వాళ్లతో మాట కలిపేవారు. సరదాగా జోకులేసుకునే వారు. కాసేపు అక్కడే టైమ్ పాస్ చేసేవాళ్లు. ’ఇప్పుడు ఇవేవి కనిపించడం లేదు.

ఇప్పుడంతా అక్కడే :

ఒకప్పుడు ఎదుటి అపార్ట్ మెంట్ లోని రాజు అన్నయ్య సిగరెట్ తాగడానికి ఓ ఐదు నిముషాలు మాత్రమే బాల్కనీకి వచ్చేవాడు. ఇప్పుడు మాత్రం ల్యాప్ టాప్ ముందరేసుకుని ఎప్పుడూ అక్కడే ఉంటున్నాడు. మరో అపార్ట్ మెంట్ లో ఉండే ఓ కుక్క బాల్కనీ డోర్ దగ్గరే ఒంటరిగా కూర్చుని ఉండేది. కానీ ఇప్పుడు అందరితో కలిసి బాల్కనీల్లో ఆడుకుంటోంది. చిన్న పిల్లలకు బాల్కనీలు ‘కొత్త ప్లే గ్రౌండ్లు’గా మారిపోయాయి. మరికొంతమందికి బాల్కనీనే తోటలా మారింది. పూలచెట్లతో, కూరగాయాల మొక్కలతో ఆ బాల్కనీ కొత్త పరిమళాలు, సరికొత్త అందాలను సంతరించుకుంది. ఇంకొంతమంది జిమ్, ఫిట్ నెస్ సెంటర్ గా టెర్రస్ ను ఉపయోగిస్తున్నారు. చాయ్ హోటళ్లు, బాబాయ్ టిఫిన్ సెంటర్లు లేకపోతేనేం.. బాల్కనీ నే న్యూ కేఫ్ పాయింట్ గా మారిపోయింది. కాలుష్యం తగ్గడంతో .. నగర అందాలను సరికొత్తగా చూపే సిటీ వ్యూ పాయింట్ కూడా బాల్కనీనే. రీయూనియన్, గెట్ టుగెదర్ స్టేజ్ కూడా బాల్కనీనే. కథలు చెప్పుకోవడానికి, ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడానికి కూడా టెర్రస్ సరికొత్త వేదికగా మారింది. ఇప్పుడు బాల్కీనీలు, టెర్రస్ లపై కొత్త జీవితాలు కనిపిస్తాయి. కొత్త కథలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News