క్రికెట్ చరిత్రలో పాండ్యా ఓ సంచలనం

దిశ, వెబ్‌డెస్క్: హార్దిక్ పాండ్యా..టీమిండియా, అంతర్జాతీయక్రికెట్‌లో ఓ సంచలనం. ఆల్‌రౌండర్‌‌గా  క్రికెట్‌ రంగంలో సముచితస్థానం కలిగిన యువఆటగాడు. టోర్నీ ఏదైనా, స్టేడియం ఎక్కడున్నా, ప్రత్యర్థి ఎవరైనా సరే సమర్థంగా ఎదుర్కొగలిగే సత్తా ఉన్న క్రికెటర్‌ పాండ్యానే. యావత్ దేశం గెలుపు కోసం వేచి చూస్తున్న తరుణంలో, అతి క్లిష్ట పరిస్థితుల్లో సైతం చేజారిపోతున్న మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చడంలో పాండ్యా దిట్టా. అనతి కాలంలో భారత జాతీయ జట్టులో తనదైన ముద్రవేశాడు ఈ గుజరాత్‌ కుర్రాడు. అసలు హార్దిక్ […]

Update: 2020-12-08 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: హార్దిక్ పాండ్యా..టీమిండియా, అంతర్జాతీయక్రికెట్‌లో ఓ సంచలనం. ఆల్‌రౌండర్‌‌గా క్రికెట్‌ రంగంలో సముచితస్థానం కలిగిన యువఆటగాడు. టోర్నీ ఏదైనా, స్టేడియం ఎక్కడున్నా, ప్రత్యర్థి ఎవరైనా సరే సమర్థంగా ఎదుర్కొగలిగే సత్తా ఉన్న క్రికెటర్‌ పాండ్యానే. యావత్ దేశం గెలుపు కోసం వేచి చూస్తున్న తరుణంలో, అతి క్లిష్ట పరిస్థితుల్లో సైతం చేజారిపోతున్న మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చడంలో పాండ్యా దిట్టా. అనతి కాలంలో భారత జాతీయ జట్టులో తనదైన ముద్రవేశాడు ఈ గుజరాత్‌ కుర్రాడు. అసలు హార్దిక్ క్రికెట్ రంగంలోకి ఎలా వచ్చాడో తెలిస్తే అందరూ ఔరా అనాల్సిందే.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్..

ఇంతటి ప్రతిభ కలిగిన ఆటగాడు మధ్య తరగతి నుంచే వచ్చాడు. పెద్ద పెద్ద కోచింగ్ సెంట్లకు వెళ్లకపోయిన తన తండ్రి ప్రొత్సహంతో క్రికెట్‌ మీద ఫోకస్ చేశాడు హార్దిక్. గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో చిరు వ్యాపారం చేసే హార్ధిక్ తండ్రి హిమాన్షు.. పాండ్యాకు ఐదేళ్లు ఉన్నప్పుడే వడోదరాకు మకాం మార్చాడు. అక్కడే స్థానికంగా ఉన్న క్లబ్‌ క్రికెట్‌లో కోచింగ్ ఇప్పించాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉంటూ హర్దిక్, కృనాల్‌ పాండ్యాలను క్రికెట్‌ వైపే మొగ్గుచూపించాడు హిమాన్షు. అయితే, పాండ్యా 18 ఏండ్ల వయస్సు వరకు లెగ్‌ స్పిన్ మాత్రమే వేసేవాడని.. బరోడా జట్టు కోచ్ సనత్ కుమార్ సహకారంతో అది కాస్తా ఫాస్ట్ బౌలింగ్‌గా మలుచుకున్నాడని హిమాన్షు గుర్తుచేసేవారు.

2013-14 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకి..

సామర్థ్యాలు ఎంత ఉన్నా ఓ ఆటగాడు వెలుగులోకి రావాలంటే అందుకు చక్కటి వేదిక తప్పా మారో మార్గం లేదు. కానీ, హార్దిక్ పాండ్యాకు మాత్రం దేశీయ వాలి క్రికెట్ టోర్నమెంట్లు తన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డాయి. తొలిసారిగా 2013-14లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున బరిలోకి దిగిన హార్ధిక్ ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. వరుస సిక్సర్లతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడమే కాకుండా బీసీసీఐ దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ముఖ్యంగా పాండ్యా సిక్సర్ల మోత అతడిని మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

https://twitter.com/i/status/686258913390399488

ఐపీఎల్‌కు ఆహ్వానించిన ముంబై ఇండియన్స్:

పాండ్యా బరోడా జట్టు నుంచి కనబర్చిన ప్రతిభతోనే రిచ్ ప్రిమియర్‌ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ipl)లో స్థానం సంపాధించాడు. 2015లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన హార్దిక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద 6 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి 18 పరుగులతో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్నది కాసేపు అయిన తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.. చాలా మ్యాచుల్లో వేగంగా పరుగులు తీస్తూ, బౌండరీలను పారిస్తూ తన హిట్టింగ్ ప్రదర్శనను నిలబెట్టుకున్నాడు. దీంతో 2015 నుంచి నుంచి ఇప్పటివరకు ముంబై జట్టు హార్దిక్‌ను విత్‌డ్రా చేసుకోలేదు.

జాతీయ జట్టులోకి ఎంట్రీ..

ఇక ఐపీఎల్‌ 2015 సీజన్‌ హార్దిక్ ఆటతీరు బీసీసీఐని ఆకట్టుకోవడంతో నేరుగా జాతీయ జట్టులో అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలోనే జనవరి 26, 2016లో టీమిండియా తరఫున హార్దిక్ ఆస్ట్రేలియా జట్టుతో తొలి టీ-20 ఆడాడు. ఆడిన ప్రతీ సిరీస్‌లో తన ఉనికిని చాటడంతో అదే సంవత్సరం అక్టోబర్ 16న న్యూజీలాండ్ జట్టుతో వన్డే మ్యాచుల్లో అరంగేట్రం చేశాడు. రెండు ఫార్మాట్‌లో సమిష్టిగా రాణించాడు. దీనికి తోడు 2017 జులై 26న శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఇండియా తరఫున జట్టులోకి వచ్చాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్, తడబాటుతనం చూపించని హార్ధిక్‌ డేరింగ్ బ్యాట్స్‌మెన్‌‌గా పేరుతెచ్చుకున్నాడు. అతడి వీరోచిత బ్యాటింగ్‌కు అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

బంతితో రాణించగలడు..

ఏ బ్యాట్స్‌మెన్ అయినా బంతితో రాణించడం అనేది కష్టతరం. బ్యాట్‌ మీదనే ఫోకస్ చేసే ఆటగాళ్లు బౌలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపించారు. కానీ, హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆరితేరిపోయాడు. దీనికి తోడు అద్భుతమైన ఫీల్డింగ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. హార్డ్ హిట్టర్లను సైతం తన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టడంలో కూడా పేరుతెచ్చుకున్నాడు. జట్టులోనే ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్రవేశాడు. ఎంతో మంది మోడ్రన్‌ యువతకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు.

సామాన్య మధ్య తరగతి నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా అత్యున్నత శిఖరాలను అధిరోహించడం గర్వకారణంగానే చెప్పాలి. ఇదే కాకుండా 2011 ఇండియా వరల్డ్ కప్ కొట్టిన సమయంలో భారత అభిమానుల్లో ఒకడిగా ఉన్న హార్దిక్ 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఉన్నాడు అంటే అతడి పట్టుదలను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో ఆల్‌రౌండింగ్ ప్రదర్శన చేసేది కేవలం హార్దిక్ ఒక్కడే అని క్రికెట్ విశ్లేషకుల బలమైన అభిప్రాయం.

Tags:    

Similar News