నిద్రలేమితో బాధపడుతున్నారా..?

నేటి ఉరుకులు పరుగుల కాలంలో మనిషికి కాస్తంత ఉపశమనమిచ్చేది ఏదైనా ఉందా అంటే అది నిద్ర మాత్రమే. పడుకోగానే నిద్రలోకి జారుకునే వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. అయితే, ఈ అదృష్టం చాలామందికి లేకుండాపోతోంది. రోజుకు 8గంటలకు పైగా కంప్యూటర్లతో కుస్తీ, పడుకునే ముందు మొబైల్ ఫోన్లతో దోస్తీ, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి కారణాలేవైనా కావచ్చు. కానీ, ఈ సమస్యను సులభంగానే అధిగమించొచ్చు. రాత్రి భోజనం తరువాత చిరుతిళ్లు తినడం ఆరోగ్యానికి అంత […]

Update: 2020-03-10 08:16 GMT

నేటి ఉరుకులు పరుగుల కాలంలో మనిషికి కాస్తంత ఉపశమనమిచ్చేది ఏదైనా ఉందా అంటే అది నిద్ర మాత్రమే. పడుకోగానే నిద్రలోకి జారుకునే వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. అయితే, ఈ అదృష్టం చాలామందికి లేకుండాపోతోంది. రోజుకు 8గంటలకు పైగా కంప్యూటర్లతో కుస్తీ, పడుకునే ముందు మొబైల్ ఫోన్లతో దోస్తీ, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి కారణాలేవైనా కావచ్చు. కానీ, ఈ సమస్యను సులభంగానే అధిగమించొచ్చు.
రాత్రి భోజనం తరువాత చిరుతిళ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. కానీ, హాయిగా నిద్రపోవాలంటే, పడుకునే గంట ముందు కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. వీటిలో ముఖ్యమైనది అరటిపండు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి కండరాలు రిలాక్స్ అవ్వడానికి దోహదపడుతాయి. అలాగే, ఇందులోని కార్బోహైడ్రేడ్స్ రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి, పడుకునే ముందు అరటిపండు తిని పడుకుంటే గంటలోనే నిద్రలోకి జారుకోవచ్చు. అరటిపండు మాత్రమే కాకుండా, పాలు, నట్స్ వంటివి తీసుకుంటే వెంటనే నిద్రలోకి వెళ్తామని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే, పడుకునే ముందు ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

శరీరం విశ్రాంతి కోరుకుంటుందా… అయితే ఈ ఆసనం ట్రై చేయండి

 

Tags:    

Similar News