ఒకే టీ స్టాల్‌ను రెండు సార్లు ప్రారంభించిన ఎమ్మెల్యేలు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఒకే హోటల్‌ను ఇద్దరు ఎమ్మెల్యేలు వేరు వేరు సమయాలలో ప్రారంభించారు. ఆ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాలిలా.. ఊరుకొండ పేట మండలానికి చెందిన తిరుపతి రెడ్డి కల్వకుర్తిలో టీ స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిని ఆదివారం ఉదయం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అదే హోటల్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌రెడ్డి అదే రోజు సాయంత్రం ప్రారంభించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా వేర్వేరుగా వచ్చి టీ […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఒకే హోటల్‌ను ఇద్దరు ఎమ్మెల్యేలు వేరు వేరు సమయాలలో ప్రారంభించారు. ఆ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాలిలా.. ఊరుకొండ పేట మండలానికి చెందిన తిరుపతి రెడ్డి కల్వకుర్తిలో టీ స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిని ఆదివారం ఉదయం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అదే హోటల్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌రెడ్డి అదే రోజు సాయంత్రం ప్రారంభించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా వేర్వేరుగా వచ్చి టీ స్టాల్ ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై సోషల్ మీడియాలో పలువురు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆరాతీయగా టీ స్టాల్‌ను ప్రారంభించేందుకు మొదటగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను ఆహ్వానించారట. కానీ తాను అందుబాటులో ఉండటం లేదని చెప్పడంతో.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆహ్వానించారు. అనుకున్న ప్రకారమే టీ స్టాల్‌ను లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ వరంగల్ వెళ్లే కార్యక్రమం వాయిదా పడటంతో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.. టీ స్టాల్ ఓనర్‌కు ఫోన్ చేసి ప్రారంభానికి వస్తున్నట్టు సమాచారం ఇచ్చాడు. దీంతో మళ్లీ ప్రారంభోత్సవానికి ఆ ఓనర్ ఏర్పాట్లు చేశాడు. ఉదయం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వచ్చి ప్రారంభించిన విషయం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తెలుసో, తెలియదో అని పలువురు అభిప్రాయపడుతుండగా సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.