జర జాగ్రత్త.. 2 రోజులు బీ అలర్ట్

దిశ, వెబ్‌డెస్క్:  ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండలు పేలిపోవడంతో.. ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో వాతావరణశాఖ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పింది.  ఏపీలో రానున్న 2 రోజులపాటు వడ గాల్పులు ఉంటాయని తెలిపింది. రేపు 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ఉంటాయని, 217 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఎల్లుండి 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని […]

Update: 2021-03-31 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండలు పేలిపోవడంతో.. ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో వాతావరణశాఖ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రానున్న 2 రోజులపాటు వడ గాల్పులు ఉంటాయని తెలిపింది. రేపు 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ఉంటాయని, 217 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.

ఎల్లుండి 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని చెప్పింది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News