Venus Saturn:  శుక్ర-శని సంయోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి

Update: 2024-12-12 07:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ప్రస్తుతం, కుంభరాశిలో శని సంచారం దశలో ఉన్నాడు. అయితే, ఇదే రాశిలోకి శుక్రుడు కూడా ఉన్నాడు. ఎవరి జాతకంలో అయితే, శని శుభస్థానంలో ఉంటాడో వారికీ అధిక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా, శని ఉన్న రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వలన రెండు రాశులవారికి మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి

శని, శుక్రుల కలయిక కారణంగా ఈ రాశి వారికీ శుభంగా ఉంటుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికీ ఉద్యోగం వస్తుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టె వారికీ ఈ సమయం కలిసి వస్తుంది.

వృషభ రాశి

శని, శుక్రుల కలయిక కారణంగా ఈ రాశివారికి కూడా కూడా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడతారు. అలాగే, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా, మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News