Astrology: ధనస్సు రాశి లోకి సూర్యుడు.. ఆ రాశుల వారిపై కాసుల వర్షమే!
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి సంచారాలు చేస్తుంటాయి.
దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి సంచారాలు చేస్తుంటాయి. అయితే, సూర్యుడు ( Sun) ప్రతి నెలా తన స్థానాన్ని మార్చుకుంటాడు. మరో మూడు రోజుల్లో ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. నెల రోజుల పాటు అదే రాశిలో ఉండనున్నాడు. ఈ సమయంలో ఎవరి జాతకంలో అయితే సూర్యుడు మంచి స్థానంలో ఉంటాడో.. వారికి ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్యుడు ప్రభావితం చేయనున్న రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
మేష రాశి వారికి ఆదాయం పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది. గతంలో మీ సహాయం పొంది మిమ్మల్ని మర్చిపోయిన వారు.. తిరిగి మీ దగ్గరకు వస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారి జీవితంలో వస్తున్నా సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. మీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీశక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.