Shashta Graha : 2025 లో ఆ రాశి వారికీ 98% సక్సెస్ రేట్ ఉంటుందని చెబుతున్న జ్యోతిష్యులు
కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది
దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఏడాది క్యాలెండర్ మారుతుంటుంది. 2025 సంవత్సరంలో కన్యా రాశి ( kanya rashi) వారి జాతకం ఎలా ఉంటుందో జ్యోతిష్య నిపుణులు తెలిపారు. దీనిలో భాగంగానే కన్యరాశి వారి జ్యోతిష్యాన్ని అంచనా వేసి వివరించారు. ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది.
కన్యా రాశి వారిపై షష్ఠ గ్రహ కూటమి ప్రభావం చూపనుంది. ఈ ఏడాది కన్యా రాశి వారికి మంచిగా ఉండనుంది. 12 నెలలపాటు అనుకూలంగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా, వ్యాపారాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీనరాశిలో ఏర్పడే షష్ఠగ్రహ ఎఫెక్ట్ ఈ రాశి వారి పైన కూడా చూపనుంది.
కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే, మీరు ఎప్పటినుంచో వేచి చూస్తున్న లోన్లు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికీ, మద్యం వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.