ఉగాది పంచాంగం : మీన రాశి వారికి ఆ నెల నుంచి అద్భుతంగా ఉంటుంది
శ్రీ క్రోధినామా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాగా, ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది. ఆదాయ, వ్యయాల గురించి తెలుసుకుందాం.
దిశ, ఫీచర్స్ : శ్రీ క్రోధినామా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాగా, ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది. ఆదాయ, వ్యయాల గురించి తెలుసుకుందాం.
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4
ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది. రాహువు, కేతువు వీరికి అనుకూల సమయంలో లేరు. గురుడు మాత్రం శుభ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఈరాశి వారికి పర్వాలేదు. ఆరంభం కాస్త కష్టాలు ఉన్నా తర్వాత పరిస్థితులు అన్నీ చక్కబడతాయి.ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నుంచి వీరికి అద్భుతంగా ఉండబోతుంది.
ఇక క్రోధినామ సంవత్సరంలో ఈ రాశివారు అధికంగా సంపాదిస్తారు కానీ అంతే త్వరగా ఖర్చు చేస్తారు. చికాకులు అధికం అవుతాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు మాత్రం కలిసి వస్తుంది. ఆదాయం పెరగడమే కాకుండా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా మంచిగా సక్సెస్ అవుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. విద్యార్థులు కూడా బాగుంటుంది. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి నాయకులు ప్రజాభిమానం పొందుతారు. విజయం సాధిస్తారు. ఈ రాశి వారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. భార్య భర్తల మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. స్త్రీమూలక ఆదాయం పొందుతారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.