Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (30-11-2024)

నేడు డబ్బు విలువ తెలుసుకుంటారు.

Update: 2024-11-29 21:45 GMT

మేష రాశి: నేడు డబ్బు విలువ తెలుసుకుంటారు. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కచ్చితంగా కనిపిస్తుంది. స్టేజ్ పైన ప్రసంగాలు, సెమినార్లు ఇస్తారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. వృత్తిపరంగా కూడా లాభాలు పొందుతారు.

వృషభ రాశి: చాలా ఏళ్లుగా మీరు ఏ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నారో నేడు ఆ సమస్యల నుంచి బయటపడుతారు. చదువుల కోసం ఇతర దేశాలు వెళ్తారు. కానీ పెద్దల మాట పెడచెవిన పెడతారు. ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

మిథున రాశి: నేడు ఏ విషయంలోనైనా కాస్త ఆందోళన చెందుతారు. అప్పు తీసుకున్న వారు.. స్వయంగా వారే వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ మీ భాగస్వామి ఇబ్బంది పెడుతారు. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది.

కర్కాటక రాశి: నేడు మేష రాశి వారికి ప్రయాణాలు అంత మంచివి కాదు. ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఫ్రెండ్స్ ద్వారా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఆఫీసు పరంగా వృత్తిలో వెనకబడతారు.

సింహ రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు తెప్పిస్తుంది.

కన్యా రాశి: నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు.ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి.

తులా రాశి: నేడు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. ధనాన్ని పొదుపు చేస్తారు. కానీ అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ చిన్న చిన్న విషయాల కారణంగా విచారడం మంచిది కాదు. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. మీ భాగస్వామి ఆరోగ్యం పరంగా ఇబ్బందిపడతారు.

వృశ్చిక రాశి: నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. కానీ తొందరగానే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు.

ధనుస్సు రాశి: మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. 

మకర రాశి: మీ బాల్య దశను నెమరువేసుకుంటారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు.

కుంభ రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. శుభవార్తలు వింటారు. కేవలం మిమ్మల్నే కాకుండా కుటుంబం మొత్తం సంతోషపడే క్షణాలను అనుభవిస్తారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు వెళ్తారు.

మీన రాశి: విహార యాత్రలకు వెళ్తారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. కానీ ఆర్థికంగా నష్టపోతారు. అనవసరపు ప్రయాణాలు చేయవద్దు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ సంతోషంగా డే మొత్తం గడుపుతారు.

Tags:    

Similar News