ఉగాది పంచాంగం : అష్టమంలో శని..ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త!

శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 9న తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజు పంచాంగం వినడం అనవాయితీగా వస్తుంది. కాగా ఈ క్రోధినామ సంవత్సరంలో

Update: 2024-04-02 09:38 GMT

దిశ, ఫీచర్స్ : శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 9న తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజు పంచాంగం వినడం అనవాయితీగా వస్తుంది. కాగా ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఆదాయ, వ్యయాల గురించి తెలుసుకుందాం.

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6

శ్రీ క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్త ఫలితాలున్నాయి. ఈ రాశి వారికి బృహస్పతి లాభ స్థానం, రాహువు భాగ్య స్థానం, శని అష్టమ స్థానంలో, కేతువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నందున ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మధ్యస్త ఫలితాలు ఉండబోతున్నాయి అంటున్నారు పండితులు.

ఈ రాశిలోని అన్ని వర్గాల వారు మంచి వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే శని అష్టమ స్థానంలో ఉన్నందు వలన అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు.

ఇక సంవత్సరం కర్కాటక రాశి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మధ్యస్త ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీరు కాస్త ఒత్తిళ్లకు లోను అవుతారు. సినీరంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి. విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం బాగుంది. గురుబలం వలన కళాకారులకు నూతన అవకాశాలు రావడం, అవార్డులు అందుకోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించి ఆశించిన పదవులు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆనందంగా గడుపుతారు


Similar News