Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (07-10-2024)

ఈ రోజు రాశి ఫలాలు (07-10-2024)

Update: 2024-10-06 21:30 GMT

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

వృషభ రాశి: ఈ రాశి వారిలో వ్యాపారులు కొంత ఇబ్బంది పడతారు. కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి తొందరపడాల్సి రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: ఈ రాశి వారికీ ఉదయం కలిసి రాకపోవచ్చు. అన్ని రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు జీవిత భాగస్వామి మీతో గొడవ పడుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు ఇంటికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆందోళన చెందుతారు.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో ఏదైనా పని చేస్తే, దాని వల్ల మీరు కచ్చితంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీ స్నేహితుని వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు.

కన్యా రాశి: ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో , మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు, మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగాస్వామి మీతో గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆమెకి నచ్చినట్టు ఉండండి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పొరపాట్లు చేయొచ్చు. ఈ కారణంగా మీకు ఉన్నతాధికారుల నుంచి కొంత ఇబ్బంది రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు సన్నిహితంగా ఉండే వారి సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ స్నేహితుని దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి పెళ్లి గురించి చర్చలు జరుగుతాయి.

Tags:    

Similar News