Today's Horoscope : నేటి రాశిఫలాలు

మేష రాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రావాల్సిన ధనం చేతికందుతుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇంటా బయట మీరు సంతోషంగా గడుపుతారు. మీ భవిష్యత్తు, వృత్తిపరంగా ఎదుగుదలపై దృష్టి పెట్టి

Update: 2024-05-31 18:45 GMT

మేష రాశి : మేష రాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రావాల్సిన ధనం చేతికందుతుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇంటా బయట మీరు సంతోషంగా గడుపుతారు. మీ భవిష్యత్తు, వృత్తిపరంగా ఎదుగుదలపై దృష్టి పెట్టి ఏ పనిచేసినా ఈ జీగా అయిపోతుంది. ఇక ఈ రోజు మీరు పేద ప్రజలకు పెసర పప్పు పంపిణీ చేయడం ద్వారా అనుకున్న పనుల్లో విజయం సాధించగలరు.

వృషభ రాశి : ఈ రోజు ఈరాశి వారు అధికంగా డబ్బును ఖర్చు పెడుతుంటారు. మీరు తీసుకునే కొన్ని అభిప్రాయాల వలన స్నేహితులు బాధపడే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక మీరు అనుకున్న విధంగా మీ కుటుంబ పరిస్థితి ఉండదు. ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడుతాయి. దీంతో మీరు ఎక్కువగా ఆందోళనకు గురికావాల్సి వస్తుంది. ఇక ీ రోజు మీకు నచ్చినవారితో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేయడం వలన బాధల నుంచి కాస్త ఉపశమనం పొందగలరు.

మిథున రాశి : ఆరోగ్యపరంగా ఈరోజు వీరికి బాగా కలిసి వస్తుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు.ఇతరులకి ఎవరూ అప్పు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి ఆర్థిక అవసరాలు గుర్తించి అప్పు ఇస్తారు. ఇక ఈరాశి వారికి ఈ రోజు బంధు మిత్రుల నుంచి కానుకలు, బహుమతులు అందుతాయి


కర్కాటక రాశి : ఈరాశి వారు ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు. ఇక ఇదివరకంటే ఆర్థికంగా బాగుంటారు. సాధ్యమైనంత వరకు మీరు ఈ వారం మీకుటుంబ సభ్యులతో గడపడం శ్రేయస్కరం. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు కానీ వాటన్నింటి అధిగమించి మీరు సంతోషంగా ఉంటారు. హనుమాన్ చాలిసా, శంకత్ మోచన్ అష్టకం, రామ స్తుతి ని పఠించండి, మీ కుటుంబ జీవితంలో సంతోషానికి కారణం అవుతుంది.

సింహ రాశి : వ్యాపారంలో కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈరాశివారికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. మీకు ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ వారం మీ చిన్ననాటి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రావి చెట్టుకు నీరు పోసి నెయ్యి దీపం వెలిగించడం మంచిది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వీరు ఆనందాన్ని పొందుతుంటారు. అలాగే ఈ రాశివారు మీ అమ్మతరఫున వారి నుంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసివచ్చేరోజు. ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో స్పెషల్ చేసి ఉంటుంది. ఇక ఈ రాశి వారు మర్రి చెట్టుకు నీరు, పాలు పోయడం ద్వారా వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.

తుల రాశి : మీరు అనుకున్న పనులను ఈజీగా పూర్తి చేయగలరు. వ్యాపారల్లో కాస్త నష్టాన్ని చవిచూసే అవకాశాలున్నాయి. యోగా చేయడం ద్వారా జ్ఞానాన్ని పొంది ప్రశాంతత, హాయిని పొందుతారు. ఆరోగ్యంపట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది.

వృశ్చిక రాశి : ఆరోగ్యపరంగా ఈరాశివారికి కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కుటుంబంలో పాత కలహాలు తొలగిపోతాయి. అతి విచారం మానసిక ప్రశాంతతను కలత పరుస్తాయి. పనిలో అధిక ఒత్తిడితో కాస్త ఇబ్బంది పడుతారు. ఇక తగవులకు చోటివ్వకుండా ప్రతి సమస్యను సారస్యంగా పరిష్కరించడం ద్వారా ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి : ఈరాశివారిని వీరు చుట్టు్న్న వారు అనుసరిస్తూ మిమ్ముల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీరు చేసే పనులతో అందరినుండి ప్రశంసలు అందుకుంటారు. ఇక ఈరాశివారు ఈ రోజు గంటల తరబడి ఫొన్ మాట్లాడుతుంటారు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతుంటారు.

మకర రాశి : సహోద్యోగులతో కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ ప్రయమైనవారి ప్రవర్తనతో విసిగిపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

కుంబరాశి : ఈరాశి వారు ఈరోజు ఆరోగ్యంపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థికస్థితి కుదుటపడుతుంది. స్నేహితులతో చేసే కొన్ని పనులు సంతోషాన్నిఇస్తాయి. కుటుంబంలో గొడవల కారణంగా కాస్త ఆందోళనకు గురవుతుంటారు. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి : ఈరాశివారు ఈరోజు అధికంగా ఖర్చుచేస్తారు. అసౌకర్యంచేత మీకు మానసిక అశాంతి కలుగుతుంది. ఆరోగ్యంపరంగా జాగ్రత్తలు అవసరం. కుటుంబంతో విందూ వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.


Similar News