Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
ఈరోజు యోగా, ధ్యానం చేయడం వలన ఒత్తిడిల నుంచి బయట పడుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నేడు మీరు డబ్బు ఎంత సంపాదించినా ఖర్చులు పెరగడం వలన ఇబ్బందికర సమస్యలు
మేష రాశి : ఈరోజు యోగా, ధ్యానం చేయడం వలన ఒత్తిడిల నుంచి బయట పడుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నేడు మీరు డబ్బు ఎంత సంపాదించినా ఖర్చులు పెరగడం వలన ఇబ్బందికర సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు చాలా ఇ్బందికర వాతావరణాన్ని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
వృషభ రాశి : ఆర్థిక సమస్యలు చికాకును కలిగిస్తాయి. కుటుంబంలోని కలహాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ రాశిలోని పెళ్లైన మహిళలు తమ అత్తింటి వారి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి గల చిరు వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలన్నీ కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మిథున రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.
కర్కాటక రాశి : ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈరోజు మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.
సింహ రాశి :గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంద. దూర ప్రయాణలు ఇబ్బందులు తీసుకోస్తాయి. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
కన్యా రాశి : ఈ రాశివారు ఈరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. లేదా, ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు
తుల రాశి :మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు.ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
వృశ్చిక రాశి :మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఆర్థికపరమైన సమస్యలను మీరుఈరోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు మీతెలివితేటలతో,జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగ చూసుకొండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో కలగడం వలన ఇబ్బందికర వాతావరణం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది.
ధనస్సు రాశి : మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తీసుకొస్తుంది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.
మకర రాశి :కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూలవాతావరణం కలుగుతుంది.
కుంభ రాశి : ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. నేడు పని ఒత్తిడి మిమ్ముల్ని చికాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అవి లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సాయంత్రం వేళ మీరు ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తారు.సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
మీన రాశి : రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.