Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు
మీ తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందుతారు
మేష రాశి : ఈ రోజు పిల్లలకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ మనసులో సంతోషంగా ఉంటుంది. బయట ఫుడ్స్ ఎక్కువగా తినకండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి: మీ తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందుతారు. ఈరోజు విలాసవంతమైన వాటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరోవైపు మీ శత్రువులు మిమ్మల్ని అసూయపడతారు.
మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు తండ్రి మార్గదర్శకత్వంలో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. ఈరోజు మీరు కొన్ని పనులు చేసేందుకు ప్లాన్ చేస్తారు. మీ వైవాహికజీవితం అద్భుతంగా ఉండనుంది.
కర్కాటక రాశి: డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకండి. మీ ఇంట్లో వారికి మీ సంపాదన ఎంతో చెప్పండి. దీని వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : మరోవైపు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఈరోజు కొంత క్షీణత ఉండొచ్చు. బంధుమిత్రుల్లో మీ విలువ పెరుగుతుంది. మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అలాగే కోపం అదుపులో పెట్టుకోవాలి.
కన్యా రాశి: ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు పిల్లల ప్రగతిని చూసి సంతోషపడతారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. మీ నాన్న గారికి ఏదైనా శారీరక సమస్య ఉంటే, అది ఈరోజు పెరుగుతుంది.
తులా రాశి: ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. బయటి ఆహారం తినకండి. ఉద్యోగులు ఏదైనా పార్ట్ టైమ్ పని చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు ఎవరితోనూ వాదించకుండా ఉండాలి.
వృశ్చిక రాశి:ఈ రాశి వారు పిల్లలకు సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈరోజు సమయం శుభప్రదంగా ఉంటుంది. దీని వల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు. మరోవైపు మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారిలో వ్యాపారులు ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తారు. దీని వల్ల మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు. మీ జీవిత భాగస్వామికు , మీకు గొడవలు అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికల గురించి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపండి. ఈ రోజు సాయత్రం శుభవార్తలు వింటారు.
కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు కొంచెం బిజీగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలు రావొచ్చు. మీ భాగస్వామి, పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.
మీన రాశి: ఈ రాశి వారిలో విద్యార్థులు సోమరితనాన్ని వదిలేసి కష్టపడి పని చేయాలి. అప్పుడే మీరు పరీక్షల్లో మెరుగైన విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగాగడుపుతారు.