ఈ రాశివారి వ్యాపారంలో నష్టాలు తప్పవు

ఈరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన కలిగించే అంశాల గురించి ఆలోచించడం వదిలేయాలి. దానధర్మాలు, సంఘసేవలు చేయడం వలన మనశ్శాంతి కలిగే

Update: 2022-08-23 18:45 GMT

మేష రాశి : ఈరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన కలిగించే అంశాల గురించి ఆలోచించడం వదిలేయాలి. దానధర్మాలు, సంఘసేవలు చేయడం వలన మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఒక వేళ మీరు మీ డబ్బుని ఇతర దేశాలలోని స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడు పోయి మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : ఈరాశి వారికి ఈరోజు వ్యాపారంలో నష్టాలు తప్పవు. మీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేయకండి, లేకపోతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోకక తప్పదు. మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. అనుకోని బంధువు రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది.

మిథున రాశి : వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. డబ్బును ఆదాచేయండి, అది మిమ్ముల్ని ఇబ్బందుల నుంచి తప్పిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు నిరాశకు గురిచేస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.


కర్కాటక రాశి : ఈరాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్థులకు నిరాశ తప్పదు. కుటుంబంలోని కలహాలు కాస్త చికాకును కలిగిస్తాయి. మీ జీవితంలోకెళ్ల అత్యంత అద్భుతమైన రోజు కానుంది. అనుకోని అథితుల రాకతో ఈ సాయంతో ఆనందంతో గడవనుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహ రాశి : మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మంచి, చెడు ఎదైనా సరే సమానంగా తీసుకోండి. అదే మీ సమస్యలను పరిష్కరించగలదు. మీ విలువైన వస్తువులను పొగొట్టుకునే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి పెండిగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. టెన్షన్లు వదిలి ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా ఎంజాయ్ చేయండి.

కన్యారాశి : ఈరాశి ఈరోజు విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలు చేతికందే అవకాశం ఉంది. మీ చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని వ్యక్తుల ద్వారా ధనం చేతికదడంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. మీ బంధువులదరీతో ఆనదంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు శ్రమ అధికం అవుతుంది. సీనియర్ల నుంచి ఒత్తిడి చికాకును కలిగిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి : చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు కాస్త ఆందోళనకరంగా ఉంటాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్ముల్ని పరపతిగల వ్యక్తులను పరిచయం చేస్తాయి. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉదోగులు వారి సహ ఉద్యోగులనుండి ప్రశంసలు, సపోర్ట్ లని పొందుతారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.

ధనస్సు రాశి : అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలవర పరుస్తాయి. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం మిమ్ముల్ని టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. ఈరోజు ఖర్చులు అధికంగా చేసే అవకాశం ఉంది. వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యే వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.


మకర రాశి : పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి, ఇంట్లో పట్టించుకోని తనం మీకు కొంత వరకు చికాకును కలిగిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులు కూడా వారిపనితనాన్ని చూపిస్తారు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీనికారణము మీయొక్క పాతవస్తువులు మీకుదొరుకుతాయి. రోజుమొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు.

కుంభ రాశి : ఈరోజు మీరు మీకు తెలియని వ్యక్తుల నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీంతో ఆర్థికసమస్యలన్నీ తొలిగిపోయే అవకాశం ఉంది. మీకు ఎంతో ఇష్టమైన వారితో మీరు గొడవ పడే అవకాశం ఉంది. ఎదైనా కొత్త ప్రాజెక్టులు ఒకే చెప్పే ముందు ఆలోచించడం మంచిది. వైవాహిక జీవితం బాగుటుంది.

మీన రాశి : సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగ జాగ్రత్త అవసరం. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

Tags:    

Similar News