Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (28-08-2024)

ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోకుండా మనీ ఖర్చు పెడుతుంటారు.

Update: 2024-08-27 22:15 GMT

మేష రాశి: ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోకుండా మనీ ఖర్చు పెడుతుంటారు. అశ్రద్ధ వల్ల నష్టాలు జరుగుతాయి. ఇతరులతో మీ కష్టసుఖాలు పంచుకుంటే మీ మనసు కుదుటపడుతుంది. నేడు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. మీపై మీ భాగస్వామి తప్ప వేరేవారు చొరవ చూడానికి ప్రయత్నిస్తారు. కానీ అది గొడవలకు దారీ తీస్తుంది. ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ రాశివారు ఖాళీగా ఉన్న గిన్నెలో కాంస్య ముక్కను పెట్టండి.

వృషభ రాశి: నేడు ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన వర్క్ చేయండి. తత్ఫలితంగా మీరు మంచి అనుభూతిని పొందుతారు. ఈ రాశివారు డబ్బు పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రిలేషన్స్ ఇంటికి వస్తూ ఉంటారు. దీంతో ఏ పనిని మీరు ముగించలేరు. మీ ప్రేమ బంధం నేడు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టాలంటే రావి చెట్టు మూలాలపై ఆయిల్ పోయండి.

మిథున రాశి: పక్కవారికి చెడు చేయాలన్న ఆలోచనలు వెంటనే మానుకోండి. ఎందుంటే ఆ ఆలోచనలు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. మీ సమయం వృథా అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పని పట్ల తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయినా చివరికి మీ భాగస్వామి ద్వారా రిలీఫ్ పొందుతారు. ఆఫీసులో సహ ఉద్యోగులతో మీ బంధం బాగుంటుంది. మీ లైఫ్ లో మంచి జరగాలంటే చెట్లను, మొలకలను తెంచకూడదు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి నేడు ఎక్కడికెళ్లినా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఊరికే ఆవేశపడుతుంటారు. కాగా తొందరపడకుండా ఆవేశంతో ముందుకు దూకకుండా ప్రశాంతమైన మనసుతో ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించండి. ఈ రాశి వారు ఎక్కువమందితో స్నేహం చేయవద్దు. దీంతో మీ లైఫ్ లో పలు అనుకూల మార్పులు జరుగుతాయి. మంచి జరగాలంటే ఇతరులకు తూచిన సాయం చేయండి.

సింహ రాశి: మీ పిల్లలైనా, ఇతరుల పిల్లలపైన అయినా ప్రేమను కనబరుస్తారు. ఆస్తుల విషయంలో గొడవలకు దిగవద్దు. ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టిన సజావుగా సాగిపోతుంది. ఎదుటివారితో మీ పర్సనల్ విషయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేయడం మంచిది.

కన్యా రాశి: మీ స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా ప్రయోజానాలు పొందుతారు. ఈ రోజును మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఈ రోజు మీకు ప్రయాణం అంత సౌకర్యవంతంగా ఉండదు. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. నేడు పెరుగు, పాలు, తెలుపు రంగు పువ్వులు దానం చేయండి.

తులా రాశి: నేడు ఈ రాశివారు చాలా ఎనర్జీగా ఉంటారు. మంచి ఫలితాలు పొందుతారు. కానీ కుటంబ పరిస్థితుల కారణంగా మూడ్ ఆఫ్ అవుతారు. కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు.చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మిమ్మల్ని నవ్విస్తారు. మీరు ప్రతి రోజూ ప్రశాంతతను పొందాలంటే ఒక కుండలో విధర చెట్టు మూలాలను నానబెట్టండి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు రాత్రి పూట ఎక్కువగా లాభాలు పొందుతారు. మీ భాగస్వాములు మీ ఆలోచనల్ని గౌరవిస్తారు. ఈ రోజు అంతా హాయిగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. కొత్తగా బిజినెస్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు. నేడు మీకు తెలియకుండానే టైం గడిచిపోతుంది. ఫ్రెండ్స్‌ తో గడపండి. ఖాళీగా ఉన్న టైంలో కొత్తగా ఆలోచించండి.

ధనుస్సు రాశి: వీరికి అవసరమైనప్పుడు ఎవరూ అప్పుగా ఇవ్వరు. కానీ ఈ రాశి వారు ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎదుటివారి పట్ల ఎక్కువ ప్రేమను పంచుతారు. నేడు కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. వారి కారణంగా మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. నేడు ధనుస్సు రాశి వారు గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం మంచిది.

మకర రాశి: ఏదైనా పని చేసేటప్పుడు కంగారు పడకండి. టెన్షన్ లేకుండా ప్రశాంతగా ఉన్నట్లైతే పనులు సవ్యంగా జరుగుతాయి. ఫైనాన్షియల్ గా బాగానే ఉంటారు. ఉమ్మడి వ్యాపారాలు చేయకండి. స్నేహితులతో సాయంత్రం పూట సంతోషంగా గడపండి. ఈ రాశి వారు నేడు అత్యంత ధనవంతులుగా ఫీల్ అవుతుంటారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు.

కుంభ రాశి: మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. అవసరమైన వాటికోసం మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించండి. మీపై మీ భాగస్వామి ఎనలేని ప్రేమను కురిపిస్తారు. చిన్న చిన్న ఆనందాలను పొందుతారు. ఇరుగుపొరుగు వారితో కాస్త తొందరపాటు మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది.

మీన రాశి: ఈ రాశి వారు నేడు ఆర్థికంగా నేడు ఇబ్బందులను ఎదుర్కుంటారు. అనుకోకుండానే చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. కాగా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. అవమానాలు ఎదుర్కునే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో సమస్యలను ఎలా ఫేస్ చేయాలో మనసు పెట్టి ఆలోచించండి. మార్గం అదే దొరుకుతుంది. సాయంత్రం వేళ స్నేహితులతో సమయాన్ని గడపండి. మీ ఇంటికి ఎక్కువగా బంధువులు వస్తూ ఉంటారు. అతిథులచే మీరు ప్రశంసలు అందుకుంటారు.


Similar News