2023 పంచాంగం: వ్యయలో గురువు ఉండటం వలన వృషభ రాశి వారు డబ్బు విషయంలో మోసపోతారు

భాగ్య స్థానంలో శని, దశమంలో గురువు, వ్యయంలో రాహువు, షష్టంలో కేతువు ఉండడం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం, ధనలాభం, పేరు ప్రతిష్టలు

Update: 2023-03-21 14:01 GMT

వృషభ రాశి

సౌర గోచారము : వృషభ మాసములో పుట్టినవారికి

చాంద్రగోచారము : కృత్తిక 2, 3, 4; రోహిణి : మృగ 1,2

నామ నక్షత్రము : ఈ, ఉ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో

ఆదాయ వ్యయాలు

ఆదాయం 14,

వ్యయం 11,

రాజపూజ్యం 6,

అవమానం 1

గురువు : ఏప్రిల్ 22 వరకు 11న లోహమూర్తి. అన్ని రంగములయందు చికాకులు పెరుగును. తదాది వత్సరపర్యన్తం 12న లోహమూర్తి. వ్యవహారములందు వ్యతిరేకతలు పెరుగును.

శని : వత్సరపర్యన్తం 10న తామ్రమూర్తి. కొద్దిపాటి నష్టంతో అన్ని పనులు నెరవేరుతాయి.

రాహువు : అక్టోబరు 30 వరకు 12న లోహమూర్తి. వ్యవహారములందు అనుకోని వ్యతిరేకత పెరుగును.తదాది వత్సరపర్యన్తం 11న సువర్ణమూర్తి. అన్ని రంగములయందు శుభాధిక్యత పెరుగును

కేతువు : అక్టోబరు 30 వరకు 6న లోహమూర్తి.తరచు అనారోగ్యం కలుగును, ధనను కలుగును. తదాది వత్సరపర్యన్తం 5న సువర్ణమూర్తి. అయిన వారితో ఆర్ధిక చికాకులు, స్వల్ప విరోధములు పెరుగును.

భాగ్య స్థానంలో శని, దశమంలో గురువు, వ్యయంలో రాహువు, షష్టంలో కేతువు ఉండడం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం, ధనలాభం, పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంభవిస్తాయి. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. గురు గ్రహం వ్యయ రాశి సంచారం వల్ల డబ్బు విషయంలో మోసపోవటం కానీ, మిత్రుల వల్ల నష్టపోవటం కానీ జరుగుతుంది. అంతే కాకుండా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్నేహితురాలితో పెళ్లి జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారి సంతానం విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. లాయర్లకు అనుకూల సమయంగా చెప్పవచ్చు.డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. టెక్నాలజీ నిపుణులకు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. కోపతాపాలకు ఇది సమయం కాదు.

సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు, ఇది మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఈ రాశి వారికి ఏప్రిల్ మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం పట్టవచ్చు. ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఇక ఈ రాశి వారు అనవసర పరిచయాలకు, విందు, విలాసాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.

Read more:

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2023 పంచాంగం : మేషరాశి వారికి ఈ సారి అద్భుతమైన ఫలితాలు  

Tags:    

Similar News