Malavya Rajyog Yog: మాలవ్య రాజయోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
ఆ రాశులవారి పైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి సంచారాలు చేసేటప్పుడు 12 రాశులవారి పైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జనవరి 2025 సంవత్సరంలో శుక్రుడు కొన్ని గ్రహాలతో కలవనున్నాడు. దీని కారణంగా ' మాలవ్య రాజయోగం ' ఏర్పడుతోంది. ఈ యోగం ఏర్పడడం వల్ల పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా రెండు రాశుల వారికీ వ్యాపారాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి ( makara rashi )
శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా, వీరు మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఎవరితో వాదనలకు వెళ్లకపోవడమే మంచిది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం.
కర్కాటక రాశి ( karkataka rasi )
మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశివారికి కలిసి వస్తుంది. అంతేకాకుండా, సంపాదనలో విపరీతమైన మార్పులు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.