Horoscope: శుక్ర, శని గ్రహాల కలయిక.. ఆ రాశులవారికి గుడ్ టైం స్టార్ట్..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో కుంభరాశిలో శుక్ర, శని గ్రహాల కలవబోతున్నాయి. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపైన పడనుంది. ముఖ్యంగా, వాటిలో రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కుంభ రాశి ( kumbha rashi )
కుంభ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికీ మంచి జాబ్ వస్తుంది. వ్యాపారాలు చేసే పెట్టె వారికీ ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టె వారికీ లాభాలు వస్తాయి. అలాగే, పెండింగ్ పనులును పూర్తి చేస్తారు. దీంతో పాటు, ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టిన సులభంగా విజయాలు సాధిస్తారు.
వృషభ రాశి ( vrushaba rashi )
శని, శుక్ర గ్రహాలు కలవడం వలన వృషభ రాశి రాశివారికి మంచిగా ఉంటుంది. దీంతో పాటు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.