శోభకృత్ నామసంవత్సరలో మకర రాశి ఫలితాలు
ఏప్రిల్ తర్వాత శని కుంభంలోనూ, గురువు మీనంలోనూ, రాహువు చతుర్ధంలోనూ, కేతువు దశమంలోనూ సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆస్తినష్టాలు, అనారోగ్యాలు,
మకర రాశి
సౌర గోచారము: మకర మాసములో పుట్టిన వారికి
చంద్ర గోచారము: ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1,2
నామ నక్షత్రము: భో, బి. జి. బి. ఖు, బో, గ్యా డి
ఆదాయ వ్యయాలు
ఆదాయం 11,
వ్యయం 5,
రాజపూజ్యం 2,
అవమానం 6
గురువు : ఏప్రిల్ 22 వరకు 8న లోహమూర్తి, ఇరుగుపొరుగుతో చికాకులేర్పడును. తదాది వత్సరపర్యన్తం 4న లోహమూర్తి.అనారోగ్య భావన, మానసిక ఆందోళన, అన్నిరంగములలో అడ్డంకులు ఏర్పడును.
శని : వత్సరపర్యన్తం 2న సువర్ణమూర్తి, విరోధములు కలుగుచున్నను కార్యసిద్ధియగును.
రాహువు :అక్టోబర్ 30 వరకు 4న లోహమూర్తి. అనారోగ్య భావన మానసిక ఆందోళన పెరుగును. తదాది వత్సరపర్యన్తం 3న రరజతమూర్తి శుభాశుభములు మిశ్రమంగా ఉండుు
కేతువు : అక్టోబరు 10 వరకు 10న లోహమూర్తి. అన్ని రంగములలో అడ్డంకులు ఏర్పడున. తదాది వత్సరపర్యన్తం 9న రజతమూర్తి. అన్నిరంగముల యందు విషమ సమస్యలు తీరును.
ఏప్రిల్ తర్వాత శని కుంభంలోనూ, గురువు మీనంలోనూ, రాహువు చతుర్ధంలోనూ, కేతువు దశమంలోనూ సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆస్తినష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు వంటివి తప్పకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాలు, దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది. 023-2024 కాలం ఆర్థిక విషయానికి వస్తే తులా రాశికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఈ కాలంలో మీరు డబ్బు పరంగా కొన్ని సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీరు వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని అవకాశాలను పొందుతారు. 2023 మొదటి అర్ధభాగంలో కొంత ఆర్థిక అస్థిరత కనిపించవచ్చు. మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఊహించని ఖర్చులు లేదా అప్పులను కూడా ఎదుర్కోవచ్చు. సంవత్సరం రెండవ సగం కొంత ఉపశమనం కలిగించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో కొంత వృద్ధి ఉంటుంది. సంవత్సరం చివరి సగం కొన్ని శుభవార్తలను తెస్తుంది. మీరు మీ ఆదాయం లేదా వ్యాపార లాభాలలో పెరుగుదలను చూడవచ్చు.ఏడాది ఈ రాశి వారికి జీవితమంతా శుభమయంగా ఉంటుంది. శుభవార్తలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది.
స్త్రీ సౌఖ్యం, మిత్రుల సహకారం దానధర్మములు చేయుట మాతృవంశ అభివృద్ధి, గృహనిర్మాణాలు చేపట్టెదరు. కొన్ని సమస్యలు పరిష్కారవుతాయి. మాసాంతముని కొద్దిగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మనోవ్యాకులత పెరుగును. ఊహించని సన్నివేశాలతో విస్మయం చెందుతారు. దైవ సందర్శనము, మిత్రుల సహకారం, దానధర్మములు చేయుట, భార్యాభర్తల మధ్య అవగాహన, కీర్తి ప్రతిష్ఠలు కలుగును. మీ సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవము కలుగును. నూతన ప్రయాణములకు అవకాశాలు కలుగును. అధికారులను, ప్రముఖులను సంప్రదిస్తారు. అన్ని సమస్యలు నిదానంగా తొలుగుతాయి.
ఈ రాశివారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖ౦ పట్టే అవకాశం ఉంది. ప్రతి పనీ అలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శద్ధ అవసరం. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థికనిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు.కోర్టు వ్యవహారములు స్తంభించును. శక్తికి మించిన కార్యములు చేయవలసివచ్చును. మాసాంతమున పెద్దలతో అంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
ఇవి కూడా చదవండి:
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి