2023 పంచాంగం : కర్కాటక రాశి వారికి ఏడాదంతా అనుకూల ఫలితాలతో సాగిపోతుంది

ఏప్రిల్‌ తర్వాత అష్టమంలో శని, నవమంలో గురువు, దశమంలో రాహువు, నాలుగింట కేతువు ఉన్నందువల్ల పరిస్థితులు బాగా సానుకూలపడతాయి. ఈ ఏడాదంతా అనుకూల ఫలితాలతో

Update: 2023-03-21 15:01 GMT

కర్కాటక రాశి

సౌర గోచారము : కర్కాటక మాసములో పుట్టిన వారికి

చంద్ర గోచారము : పునర్వసు 4 పుష్యమి, ఆశ్రేష

నామ నక్షత్రము: హి, హూ, హే, డ, డీ, డూ, డే, డో


ఆదాయ వ్యయాలు

ఆదాయం 11,

వ్యయం 8.

రాజపూజ్యం 5,

అవమానం 4

గురువు : ఏప్రిల్ 22 వరకు 8న రజత మూర్తి. అన్నిరంగముల యందు విషమ సమస్యలు తీరును. తదాది వత్సరపర్యస్తం 10న తామ్రమూర్తి. కొద్ది పాటి నష్టంతో అన్ని పనులు నెరవేరుతాయి.

రాహువు: అక్టోబరు 30 వరకు 10న రజతమూర్తి. శుభకార్యములకు విఘ్నములు ఎక్కువ. తదాది వత్సరపర్యస్తం 9న సువర్ణమూర్తి. అన్ని ప్రయత్నములందు విజయము చేకూరగలదు.

కేతువు : అక్టోబరు 30 వరకు 4న రజతమూర్తి శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ.తదాది వత్సరపర్యస్తం3న అన్ని ప్రయత్నముల యందు విజయం చేకూరగలదు.

ఏప్రిల్‌ తర్వాత అష్టమంలో శని, నవమంలో గురువు, దశమంలో రాహువు, నాలుగింట కేతువు ఉన్నందువల్ల పరిస్థితులు బాగా సానుకూలపడతాయి. ఈ ఏడాదంతా అనుకూల ఫలితాలతో సాగిపోతుంది. మీకు ఏప్రిల్‌ తర్వాత ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కష్టపడటం వల్ల కొద్దిపాటి ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలను ఎదుర్కొనే సహనం, ఓర్పు అలవరచుకుంటారు. ఇక కుమారుడికి గానీ, కుమార్తెకు గానీ విదేశీ కంపెనీలో మంచి ఉద్యోగం లభించవచ్చు. కోర్టు కేసు ఒకటి సానుకూలపడే అవకాశం ఉంది. దాయాదులతో వివాదాలు కొనసాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అడపాదడపా ఆరోగ్యం చికాకు కలిగిస్తుంది.వివాహాది శుభకార్యములు స్థిరపడును, పుణ్య నదులలో స్నానము లభించగలదు. ఆర్ధిక ఇబ్బందులతో చికాకులు పెరుగును. వర్తక, వ్యాపారములకు మధ్యముగా ఉన్నది. ఉద్యోగస్థులు రివర్షన్ లేక సస్పెండు అయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములలో రాజీ ప్రయత్నము ఉత్తమము. స్నేహితుల సహాయ సహకారములు బాగా లభించును. కుటుంబ వ్యవహారములు అనుకూలముగా ఉండును. సంతానమునకు అభివృద్ధి కలుగును.పిల్లలు చదువుల్లో కూడా పురోగతి సాధిస్తారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు వెళతారు. ఇక ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి.

సామాజిక హోదా పెరుగుతుంది. . విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు స్నేహితులో, ఎవరో శత్రువులో తెలుసుకుని మెలగండి. ఏప్రిల్‌ వరకు వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. అనుకోకుండా బంధువులు ఇ౦టికి వచ్చే సూచనలున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్ధులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలితోనే వివాహం జరిగేఅవకాశం ఉంది. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.అన్ని రంగముల యందు విషము నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తి నిస్తుంది. విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. లాయర్లు, డాక్టర్లు కృషికి మించి ధనార్జన చేయగలరు. ఉద్యోగులు బదిలీలు కోరకుండుట మేలు. ఆరోగ్యము, సంతోషము వృద్ధి చెందును. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్ళు అలస్యమగును. నూతన ప్రయాణములకు అవకాశములు కలుగును.కుటుంబ వ్యవహార ములు అనుకూలంగా ఉండును. పుణ్య నదులలో స్నానము లభించగలదు. సంతానమునకు అభివృద్ధి కలుగును, సినీ, కళా రంగాల వారికి మంచి ఆదరణ ఉంటుంది. వివాహాది శుభకార్యములను బంధుమిత్ర సహకారముతో నిశ్చయం చేసికోగలుగుతారు. భూ, గృహ సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి గత మాసము కంటే మేలు, అప్పుల బాధ తగ్గుతుంది, వస్త్ర వ్యాపారులకు బేరములు చురుకుగా సాగుతాయి. సోదరులతో మైత్రీ ప్రయత్నము ఫలించును.

ఇవి కూడా చదవండి :

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News