నిషాలో తేలిపోతున్న యువత.. వారి వెనుక ఎవరున్నారు.. ?
దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని హుక్కా, గంజాయి పెద్ద మొత్తంలో సప్లై అవుతుందని వినికిడి. గతంలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇందల్వాయి మండలానికి చెందిన గంజాయి,హుక్కా, ముఠా దొరికింది. కానీ దీనికి అసలు గ్యాంగ్ లీడర్ ఎవరనేది బయటకు రాలేదు. మంచి మార్గంలో నడవాల్సిన యువకులు చెడుమార్గాన్ని ఎంచుకోవడం పట్ల ఎవరికీ అంతు చిక్కడం లేదు. అసలు ఈ హుక్కా, గంజాయిని అరికట్టకపోవడం వల్లనే యువకులు చెడిపోతున్నారని తెలుస్తోంది. మండలంలో ఇంకా ఎంత […]
దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని హుక్కా, గంజాయి పెద్ద మొత్తంలో సప్లై అవుతుందని వినికిడి. గతంలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇందల్వాయి మండలానికి చెందిన గంజాయి,హుక్కా, ముఠా దొరికింది. కానీ దీనికి అసలు గ్యాంగ్ లీడర్ ఎవరనేది బయటకు రాలేదు. మంచి మార్గంలో నడవాల్సిన యువకులు చెడుమార్గాన్ని ఎంచుకోవడం పట్ల ఎవరికీ అంతు చిక్కడం లేదు. అసలు ఈ హుక్కా, గంజాయిని అరికట్టకపోవడం వల్లనే యువకులు చెడిపోతున్నారని తెలుస్తోంది. మండలంలో ఇంకా ఎంత మంది యువకులు ఈ హుక్కా, గంజాయికి బానిసలు అవుతారో అంతుచిక్కడం లేదు.
మరోవైపు రాజకీయ నాయకుల అండదండలు వున్నాయెమోనని గుసగుసలు విన్పిస్తున్నాయి. దీని వెనుకు పెద్ద పెద్ద వారి అండదండలు ఉండొచ్చని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఈ హుక్కా, గంజాయి, మితిమీరి పోయినట్లయితే ఎంతో మంది కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళ చెందుతున్నారు. లోతుగా విచారణ చేసినట్లైతే ఎంతో మంది బండారం బట్టబయలు అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరో వైపు హుక్కా, గంజాయికి బానిసలైన యువకుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి మండల కేంద్రమే అడ్డాగా ఈ వ్యవహారం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికైనా హుక్కా, గంజాయికి పాల్పడుతున్న ముఠాను పట్టుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా హుక్కా, గంజాయి ముఠాను పట్టుకుంటారో లేదో వేచి చుడాల్సిందే.