కుమ్మరి ప్రజాప్రతినిధులకు సన్మానం
దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన కుమ్మరి సంఘానికి చెందిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్‌లను బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ హాజరై 139 మంది ప్రజాప్రతినిధులను శాలువా, కిరీటాలతో సన్మానించి, మెమొంటోలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర, సాంస్కృతిక వైభవం కలిగిన కుమ్మరి కులం గత ప్రభుత్వాల హయాంలో ఏనాడు […]
దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన కుమ్మరి సంఘానికి చెందిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్‌లను బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ హాజరై 139 మంది ప్రజాప్రతినిధులను శాలువా, కిరీటాలతో సన్మానించి, మెమొంటోలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర, సాంస్కృతిక వైభవం కలిగిన కుమ్మరి కులం గత ప్రభుత్వాల హయాంలో ఏనాడు పరిపాలన అధికారాన్ని అందుకోలేదన్నారు. కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో మంది కుమ్మరి బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారని కొనియాడారు.