హానర్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ రెండు బడ్జెట్ ఫోన్లతో పాటు ఓ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ 9ఏ, 9ఎస్ పేర్లతో స్మార్ట్ ఫోన్లను, మ్యాజిక్ బుక్15 పేరుతో ల్యాపీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఇప్పటికే రష్యాలో లాంచ్ అయ్యాయి. అయితే ఈ రెండు ఫోన్లలోనూ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో లేదు. దీని స్థానంలో హువావే యాప్ గ్యాలరీ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ రెండు బడ్జెట్ ఫోన్లతో పాటు ఓ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ 9ఏ, 9ఎస్ పేర్లతో స్మార్ట్ ఫోన్లను, మ్యాజిక్ బుక్15 పేరుతో ల్యాపీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఇప్పటికే రష్యాలో లాంచ్ అయ్యాయి. అయితే ఈ రెండు ఫోన్లలోనూ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో లేదు. దీని స్థానంలో హువావే యాప్ గ్యాలరీ ఉండటం గమనార్హం.
హానర్ 9ఏ ఫీచర్స్ :
డిస్ ప్లే : 6.30 ఇంచులు
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ22 (ఎంటీ6762ఆర్)
ర్యామ్ : 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64జీబీ
రేర్ కెమెరా : 13 +5+2 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
రంగులు : మిడ్ నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ
ధర : రూ. 9999/-
హానర్ 9ఎస్ ఫీచర్స్ :
డిస్ ప్లే : 5.45 ఇంచులు
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ22 (ఎంటీ6762ఆర్)
ర్యామ్ : 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ
రేర్ కెమెరా : 8-మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 5-మెగాపిక్సల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 3020 ఎంఏహెచ్
రంగులు : బ్లాక్, బ్లూ
ధర : రూ. 6499/-
హానర్ మ్యాజిక్ బుక్ 15 :
డిస్ ప్లే : 15.6 ఇంచులు
ర్యామ్ : 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 256 జీబీ
పాప్ అప్ వెబ్ కామ్ ఫీచర్ గల ఈ ల్యాప్‌టాప్.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉండటం విశేషం. అంతేకాదు 65డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.