రూ. 6 కోట్లు వదిలేసుకున్న లాటరీ సెల్లర్

దిశ, ఫీచర్స్ : ఒక్క లాటరీ తగిలినా చాలు.. జీవితమే మారిపోతుందంటూ ఎంతోమంది తమ కష్టపడి సంపాదించిన డబ్బులతో లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. కానీ లక్షల్లో ఒక్కరికి మాత్రమే లక్కీ లాటరీ వరిస్తుంది. ఈ సంగతి పక్కనబెడితే లాటరీ టికెట్స్ అమ్మేవాళ్ల జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. టికెట్లు అమ్మగా వచ్చిన డబ్బు మీదే ఆధారపడి బతుకుతుంటారు. ఈ క్రమంలోనే కొచ్చికి చెందిన స్మిజా మోహన్ అనే లాటరీ సెల్లర్.. రూ.6 కోట్ల విన్నింగ్ […]

Update: 2021-03-26 09:08 GMT

దిశ, ఫీచర్స్ : ఒక్క లాటరీ తగిలినా చాలు.. జీవితమే మారిపోతుందంటూ ఎంతోమంది తమ కష్టపడి సంపాదించిన డబ్బులతో లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. కానీ లక్షల్లో ఒక్కరికి మాత్రమే లక్కీ లాటరీ వరిస్తుంది. ఈ సంగతి పక్కనబెడితే లాటరీ టికెట్స్ అమ్మేవాళ్ల జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. టికెట్లు అమ్మగా వచ్చిన డబ్బు మీదే ఆధారపడి బతుకుతుంటారు. ఈ క్రమంలోనే కొచ్చికి చెందిన స్మిజా మోహన్ అనే లాటరీ సెల్లర్.. రూ.6 కోట్ల విన్నింగ్ లాటరీని కస్టమర్‌కు ఇచ్చేసి, తన నిజాయితీని చాటుకుంది. కాగా కస్టమర్‌ను మోసం చేయలేని ఆ యువతికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

కొచ్చికి చెందిన స్మిజ.. లాటరీ టికెట్లు అమ్ముతూ జీవనోపాధి పొందుతోంది. ఈ క్రమంలో ఆమె దగ్గర ఓ 12 లాటరీ టికెట్లు మిగిలిపోగా వాటిని అమ్మేద్దామనే ఉద్దేశంతో.. లాటరీ టికెట్ కస్టమర్లతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో ఆ టికెట్లను పోస్టు చేసింది. అయినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో చంద్రన్ చెట్టన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. చంద్రన్ తన లక్కీ నెంబర్లు చెప్పి, ఆ నెంబరుతో ఉన్న టికెట్‌ను కొన్నాడు. అతడు చెప్పిన నెంబర్లకే లక్కీ లాటరీ (విలువ రూ. 6 కోట్లు) తగలడంతో స్మిజ ఈ విషయాన్ని చంద్రన్‌కు చెప్పి, టికెట్ ఇచ్చింది. కస్టమర్‌ను మోసం చేసే అవకాశమున్నా, కడు పేదరికంలో ఉన్నా.. స్మిజ తన నిజాయితీని చాటుకోవడం గొప్ప విషయం. తన భర్తతో కలిసి, స్థానికి ప్రెస్‌‌లో పనిచేసిన స్మిజ.. ప్రెస్‌లో ఉద్యోగాలు పోవడంతో 2011లో లాటరీ టికెట్ల విక్రయాన్నే ఉపాధిగా మలచుకుంది.

Tags:    

Similar News