మరోసారి బైక్ ధరను పెంచిన హోండా కంపెనీ..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ మోడల్ బైకు ధరను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గత రెండు నెలల్లో హోండా సంస్థ బైకుల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం హోండా తయారు చేస్తున్న బైకులలో అత్యంత ఆదరణ ఉన్న బైకుగా షైన్ ఉంది. దీని ధరను రూ. 1,072 పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు తర్వాత హోండా షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ మోడల్ బైకు ధరను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గత రెండు నెలల్లో హోండా సంస్థ బైకుల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం హోండా తయారు చేస్తున్న బైకులలో అత్యంత ఆదరణ ఉన్న బైకుగా షైన్ ఉంది. దీని ధరను రూ. 1,072 పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు తర్వాత హోండా షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 71,550, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 76,346గా ఉంది. ధరల పెంపు ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ బైకును ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,500 వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇ
దే సమయంలో కరోనా సెకెండ్ వేవ్ పరిణామాల కారణంగా హోండా కస్టమర్లకు ఉచిత సర్వీస్ గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్య ఉచిత సర్వీస్ గడువు ముగిసే కస్టమర్లకు ఈ వెసులుబాటు ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించిన తర్వాత ఈ సర్వీసులను పొందవచ్చని వెల్లడించింది.