ఫైనల్ ఎగ్జామ్స్‌కు హోం శాఖ ఓకే

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న ఫైనల్ ఎగ్జామ్స్‌ను కాలేజీలు, విద్యా సంస్థలు ఇక నిర్వహించుకోవచ్చునని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ఉన్నత విద్యా శాఖ సెక్రెటరీకి పంపిన లేఖలో సూచించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ టర్మ్ పరీక్షలు తప్పనిసరి కాబట్టి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహణకు అనుమతినిస్తున్నట్టు హోం […]

Update: 2020-07-06 10:51 GMT

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న ఫైనల్ ఎగ్జామ్స్‌ను కాలేజీలు, విద్యా సంస్థలు ఇక నిర్వహించుకోవచ్చునని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ఉన్నత విద్యా శాఖ సెక్రెటరీకి పంపిన లేఖలో సూచించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ టర్మ్ పరీక్షలు తప్పనిసరి కాబట్టి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహణకు అనుమతినిస్తున్నట్టు హోం శాఖ పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా సహా పలురాష్ట్రాలు హైయర్ ఎడ్యుకేషన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News