లాక్‌డౌన్ అమలుకు అధికారిక ఉత్తర్వులు
న్యూఢిల్లీ : వచ్చేనెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడింపునకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. కరోనా మహమ్మారిని విస్తరించకుండా అడ్డుకునేందుకు సామాజిక దూరాన్ని కఠినంగా పాటించాలని, కాబట్టే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి వచ్చే నెల 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు.. కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్‌లకు ఆదేశాలు జారీ చేసింది. డిజాస్టర్ […]
న్యూఢిల్లీ : వచ్చేనెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడింపునకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. కరోనా మహమ్మారిని విస్తరించకుండా అడ్డుకునేందుకు సామాజిక దూరాన్ని కఠినంగా పాటించాలని, కాబట్టే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి వచ్చే నెల 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు.. కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్‌లకు ఆదేశాలు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 10(2)(i) కింద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. గతనెల 24న ఇటువంటి ఆదేశాలనే తొలిదశ లాక్‌డౌన్ సందర్భంగా జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రాల సీఎంలు, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించబోతున్నట్టు మంగళవారం ఉదయం ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగా ఇదే రోజు సాయంత్రం కేంద్ర హోం శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
Tags: lockdown, orders, MHA, home ministry, ensure, measures