నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్ : త్వరలోనే 20 వేల పోలీసు ఉద్యోగాలు

దిశ, వెబ్‌డెస్క్ : త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో రూ.కోటితో నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి పలు విభాగాల్లో ఇప్పటివరకు 80వేల నియామకాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాపనకు ప్రభుత్వం ఎంతో కృషి […]

Update: 2021-06-12 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో రూ.కోటితో నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి పలు విభాగాల్లో ఇప్పటివరకు 80వేల నియామకాలు చేపట్టామని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాపనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అందుకోసమే అధునాతన పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 70శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని హోం మంత్రి గుర్తుచేశారు.

Tags:    

Similar News