బుల్లెట్ల నుంచి అసోంను విముక్తి చేశాం: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోనే అసోం అవినీతి, ఉగ్రవాదం, హింస, చొరబాట్లు, కాలుష్యం నుంచి విముక్తి పొందగలుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్) ఒప్పందం తిరుగుబాట్లకు స్వస్తి పలుకుతుందని ఆశాభావం ప్రకటించారు. అసోంను వరదల నుంచి రక్షించే సామర్థ్యం కేవలం బీజేపీ ప్రభుత్వానికే ఉన్నదని స్పష్టం చేశారు. ఇప్పుడు బుల్లెట్ల నుంచి అసోంను రక్షించామని, మరో ఐదేళ్లు అధికారమిస్తే ఈ రాష్ట్రాన్ని వరదల నుంచీ విముక్తి చేస్తామని ప్రకటించారు. […]
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోనే అసోం అవినీతి, ఉగ్రవాదం, హింస, చొరబాట్లు, కాలుష్యం నుంచి విముక్తి పొందగలుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్) ఒప్పందం తిరుగుబాట్లకు స్వస్తి పలుకుతుందని ఆశాభావం ప్రకటించారు. అసోంను వరదల నుంచి రక్షించే సామర్థ్యం కేవలం బీజేపీ ప్రభుత్వానికే ఉన్నదని స్పష్టం చేశారు. ఇప్పుడు బుల్లెట్ల నుంచి అసోంను రక్షించామని, మరో ఐదేళ్లు అధికారమిస్తే ఈ రాష్ట్రాన్ని వరదల నుంచీ విముక్తి చేస్తామని ప్రకటించారు.
బీజేపీ పాలనలోనే అన్ని వర్గాల సంస్కృతి, భాషలు భద్రంగా ఉంటాయని, రాజకీయ హక్కులూ సురక్షితంగా ఉంటాయని తెలిపారు. బీటీఆర్ ఒప్పందం జరిగి ఏడాది గడిచిన సందర్భంగా కొక్రజార్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘అస్సామీలు-నాన్ బోడోలు అంటూ విభజన చేస్తూ హింసను ప్రేరేపిస్తున్న శక్తులను గుర్తించండి. కేవలం రాజకీయాల కోసం ఈ విభజన. ఆ శక్తులతో అభివృద్ధి సాధ్యం కాదు. అలాంటి విచ్ఛిన్న శక్తులకు మీరు బుద్ధి చెప్పాలి. బోడో ఒప్పందం తొలి వార్షికోత్సవానికి హాజరైన ప్రజలే వారి కుట్రలు ఇక సాగవని తెలపడానికి నిదర్శనం. ఇక్కడ బోడోలు, నాన్ బోడోలూ ఉన్నారు’ అని అన్నారు.