ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందే
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేవలం బంతితో మాత్రమే కాకుండా బ్యాటుతో కూడా ఆదుకుంటున్నాడు. దీంతో అతడిని తిరిగి వన్డే జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కూడా అశ్విన్‌కు మద్దతుగా నిలిచాడు. ‘అశ్విన్‌కు వన్డే క్రికెట్ ఆడటానికి మరో సారి అవకాశం ఇవ్వాలి. అతడు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ కూడా చేయగల […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేవలం బంతితో మాత్రమే కాకుండా బ్యాటుతో కూడా ఆదుకుంటున్నాడు. దీంతో అతడిని తిరిగి వన్డే జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కూడా అశ్విన్‌కు మద్దతుగా నిలిచాడు. ‘అశ్విన్‌కు వన్డే క్రికెట్ ఆడటానికి మరో సారి అవకాశం ఇవ్వాలి.
అతడు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న క్రికెటర్. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో అలాంటి బ్యాట్స్‌మాన్ ఉండటం వల్ల టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ బలం కూడా పెరుగుతుంది. వన్డేల్లో అతడికి మంచి ఎకానమీ ఉంది’ అని హాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అశ్విన్ చివరి సారిగా 2017 జూన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఇప్పటి వరకు 111 వన్డేలు, 46 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.