చైనాలో పందులకు ప్రత్యేక హోటల్స్! స్వైన్ ఫ్లూ రాకుండా చర్యలు!

దిశ, ఫీచర్స్ : పందుల కోసం చైనా 13 అంతస్థుల స్టార్ హోటల్ నిర్మించింది. వాటి బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక రోబోలు, అవేం చేస్తున్నాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు భవనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నిరంతర పర్యవేక్షణకు వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో ఉండగా.. వాటి దగ్గరకు వెళ్లాలంటే శానిటైజేషన్, ప్రత్యేక డ్రెస్ అవసరం. ఇంతకీ పందుల కోసం చైనా ఎందుకింత శ్రద్ధ చూపుతోంది? కరోనా వైరస్‌ వంటి మరో భయంకరమైన వైరస్ రాబోతుందా? […]

Update: 2021-08-05 05:58 GMT

దిశ, ఫీచర్స్ : పందుల కోసం చైనా 13 అంతస్థుల స్టార్ హోటల్ నిర్మించింది. వాటి బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక రోబోలు, అవేం చేస్తున్నాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు భవనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నిరంతర పర్యవేక్షణకు వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో ఉండగా.. వాటి దగ్గరకు వెళ్లాలంటే శానిటైజేషన్, ప్రత్యేక డ్రెస్ అవసరం. ఇంతకీ పందుల కోసం చైనా ఎందుకింత శ్రద్ధ చూపుతోంది? కరోనా వైరస్‌ వంటి మరో భయంకరమైన వైరస్ రాబోతుందా?

2018లో దేశంలో విజృంభించిన ఆఫ్రికా స్వైన్‌ ఫీవర్‌ వల్ల 40 కోట్ల పందులు చచ్చిపోయిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం పందుల్లో ఇది సగం భాగం కాగా, ఈ ఎఫెక్ట్‌తో వాటి మాంసం ధర అమాంతం పెరిగిపోయింది. చైనీయులు ప్రధాన ఆహారాల్లో పంది మాంసం కూడా ఒకటి కావడంతో.. అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతులు తగ్గించుకునేందుకు ‘పందుల’ పెంపకంపై దృష్టి పెట్టిన చైనా.. బీజింగ్‌, పింగూ జిల్లాలో 20 ఫుట్‌బాల్‌ స్టేడియంల విస్తీర్ణంలో ఐదంతస్తులతో భారీ హోటల్‌ను ఇటీవలే నిర్మించింది. ఏడాదికి 1.20 లక్షల పందుల సంతానోత్పత్తే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసింది. పందులు వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు బయోసెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేసింది. పందులు తినే ఆహారం, ఆరోగ్య సేవల విషయంలో నిపుణులతో కూడిన పర్యవేక్షణ కల్పించింది.

హోటల్‌లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు బయోసేఫ్టీ లేబొరేటరీలోని ప్రత్యేక డ్రెస్సులు ధరించి శానిటైజర్‌ షవర్‌ కింద కాసేపు ఉండాల్సి ఉంటుంది. జలుబు, జ్వర లక్షణాలు ఉంటే లోపలికి ఎంట్రీ ఉండదు. కాగా ఎత్తైన భవనాల్లో పందుల పెంపకం చేపట్టడం వల్ల వ్యవసాయ భూముల వినియోగాన్ని మూడింట ఒక వంతు తగ్గించవచ్చని చైనీయులు భావిస్తున్నారు. ఇక ఈ పింగు ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థజలాలను శుద్ధి చేసి సమీపంలోని పండ్లతోటలకు సాగునీటిగా ఉపయోగించడంతో పాటు ఘన వ్యర్థాలను ఎరువుగా మారుస్తారు.

Tags:    

Similar News