భూముల విక్రయానికి HMDA నోటిఫికేషన్
దిశ సిటీ బ్యూరో : నిధుల సమీకరణ కోసం సర్కారు ప్రభుత్వ భూములను అమ్మేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్ లోని భూములను విక్రయించేందుకు హెచ్ఎండిఏ మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాపేట, ఖానామెట్లలో కలిపి మొత్తం 64,93 ఎకరాల్లోని ప్రైమ్ ప్లాట్లను విక్రయించనున్నట్లు పేర్కొంది. కోకాపేటలోని గోల్డన్ లే అవుట్ లో 1,65 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ తో పాటు మొత్తం కోకాపేటలోని […]
దిశ సిటీ బ్యూరో : నిధుల సమీకరణ కోసం సర్కారు ప్రభుత్వ భూములను అమ్మేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్ లోని భూములను విక్రయించేందుకు హెచ్ఎండిఏ మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాపేట, ఖానామెట్లలో కలిపి మొత్తం 64,93 ఎకరాల్లోని ప్రైమ్ ప్లాట్లను విక్రయించనున్నట్లు పేర్కొంది. కోకాపేటలోని గోల్డన్ లే అవుట్ లో 1,65 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ తో పాటు మొత్తం కోకాపేటలోని 49.92 ఎకరాల స్తల విస్తీర్ణంలోని ప్లాట్లను, ఖానామెట్ లోని టీఎస్ఐఐసీ ప్లాట్లను విక్రయించనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది.
లే అవుట్ లలోని ప్లాట్ల నెంబర్లు, విస్తీర్ణంతో పాటు కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ఈ భూముల ప్రాముఖ్యతను కూడా ఈ నోటిఫికేషన్ లో తెలియజేసింది. ప్రీ బిడ్ సమావేశాన్ని ఈ నె 25వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. కొనుగోలు చేయాలనుకునే వారు తమ వివరాల్ని వచ్చే నెల 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నమోదు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇదే తేదీ , నిర్ణీత గడువు లోపే ఈఎండిలను కూడా చెల్లించాలని వెల్లడించింది. ఈ ఆక్షన్ (వేలం)ను వచ్చే నెల 15వ తేదీ ఉదయం తోమ్మిది గంటల నుంచి మధ్యాహ్నాం పన్నెండు గంటల వరకు, తిరిగి మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. 18 ఏళ్లు నిండిన మన దేశ పౌరులు, వ్యక్తులు గానీ వ్యక్తుల సమూహం (కంపెనీలు, సంస్దలు) గానీ , ప్రభుత్వ విభాగాలు గానీ, కన్సార్టియంలు గానీ వేలంలో పాల్గొనవచ్చునని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. ఆసక్తి గల వారు AUCTIONS.HMDA.GOV.IN కి లాగిన్ కావచ్చునని సూచించింది.
హెచ్ఎండీఏలో అమ్మనున్న భూమలివే
ఆర్దిక సంక్షోభాన్ని అధిగమించేందుకు సర్కారు భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) పరిధిలోని పలు సర్కారు భూములను అధికారులు గుర్తించారు. నగరంలోనే అత్యంత ఎక్కువ ధర పలికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని పలు భూములను విక్రయించనున్నారు.. కోకాపేటలో సుమారు 50 ఎకరాల పై చిలుకు, కోకాపేటలో దాదాపు 15 ఎకరాలను విక్రయించనున్నారు. కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్ లో 7.72 ఎకరాల విస్తీర్ణలోనున్న ప్లాట్ నెంబర్ ఒకటి, 7.75 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నెంబర్ రెండు, అలాగే 7.73 ఎకరాలున్న ప్లాట్ నెంబర్ మూడు, 8.94 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ నాలుగు, అలాగే 7.56 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నెంబర్ 12, 7. ప్లాట్ నెంబర్ 13లోని 7.57 ఎకరాల స్థలాన్ని విక్రయించాలని సర్కారు నిర్ణయించింది.
వీటితో పాటు రోడ్ నెంబర్ ఏడులో నియోపాలిస్ లే అవుట్ లోని రోడ్డు వైపు దక్షిణాన ఉన్న ప్లాట్ -ఏ లోని ఒక ఎకరం భూమిని కూడా విక్రయించనున్నారు. గొల్డెన్ లైల్ లే అవుట్ లోని 1.65 ఎకరాల భూమిని అమ్మేందుకు హెచ్ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఖానామెట్ లో 3.15 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ నాలుగు, అంతే విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నెంబర్ ఐదుతో పాటు 3.69 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ 12, అలాగే ప్లాట్ నెంబర్ 14లోని 2.92 ఎకరాల స్థలంతో పాటు ప్లాట్ నెంబర్ 17లోని 2.10 ఎకరాల స్థలాన్ని వేలం పాట ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముఖ్యంగా కొన్న వివాదాస్పదమైన భూములున్న ఈ రెండు ప్రాంతాల్లోని ఈ స్థలాను ప్రజలకు ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా విక్రయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని ఈ స్దలాల్ని విక్రయిస్తే సర్కారుకు దాదాపు వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించిన అన్ని రకాలు సమాచారం, పత్రాలను పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు. కానీ వేలం పాట కార్యక్రమాన్ని మాత్రం హెచ్ఎండిఏ అధికారులే నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.