తండ్రిని మించిన తనయుడు పాడి కౌశిక్ రెడ్డి..!

దిశ ప్రతినిధి, కరీంనగర్: మండలిలో అడుగు పెట్టబోతున్న పాడి కౌశిక్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా రికార్డుకు ఎక్కబోతున్నారు. తండ్రి స్థానిక సంస్థల ప్రతినిధిగా జడ్పీలో అడుగు పెట్టి.. ప్రజా క్షేత్రంలో ఓటమి చవి చూస్తే తనయుడు మాత్రం ఏకంగా అసెంబ్లీలోనే కూర్చోబోతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్థానంపై ఓ లుక్కేస్తే…! 2006లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి 2006లో జరిగిన […]

Update: 2021-11-16 10:43 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మండలిలో అడుగు పెట్టబోతున్న పాడి కౌశిక్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా రికార్డుకు ఎక్కబోతున్నారు. తండ్రి స్థానిక సంస్థల ప్రతినిధిగా జడ్పీలో అడుగు పెట్టి.. ప్రజా క్షేత్రంలో ఓటమి చవి చూస్తే తనయుడు మాత్రం ఏకంగా అసెంబ్లీలోనే కూర్చోబోతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్థానంపై ఓ లుక్కేస్తే…!

2006లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి 2006లో జరిగిన ఎన్నికల్లో వీణవంక నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా వీణవంక జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్‌లో అడుగు పెట్టాలని భావించినప్పటికీ సాయినాథ్ రెడ్డి కల సాకారం కాలేదు. తన ఓటమికి ఈటల రాజేందర్ ప్రధాన కారణమన్న భావనతో ఉన్న ఆయన ఈటల రాజేందర్ పై రాజకీయ వైరం పెంచుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీణవంక ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న పాడి కౌశిక్ రెడ్డి ఐసీఎల్‌కు ఫాస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యారు. అయితే ఇండియన్ క్రికెట్ లీగ్ పోటీలకు ఆదిలోనే అడ్డంకులు రావడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కావాల్సిన కౌశిక్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

తన అన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఈటల రాజేందర్ పై పోటీ చేశారు. అయితే ఈటల టీఆర్ఎస్ పార్టీని వీడడంతో కౌశిక్ కారెక్కారు. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ కాావాల్సినప్పటికీ సాంకేతిక కారణాలు ఆటంకం అయ్యాయి. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటా నుండి మండలికి పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో ఆయన ఎమ్మెల్సీ అయ్యేందుకు మార్గం సుగమం అయింది. త్వరలో మండలిలో అడుగు పెట్టబోతున్న కౌశిక్ రెడ్డి తండ్రిని మించిన తనయుడు అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News