నాకు సంతృప్తిగా లేదు : కల్నల్ సంతోష్ తండ్రి

దిశ, వెబ్‌డెస్క్: కల్నల్ సంతో‌ష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రకటించింది. తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు. దీంతో సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన తండ్రి ఉపేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనకు సంతృప్తిగా లేదని […]

Update: 2021-01-26 08:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: కల్నల్ సంతో‌ష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రకటించింది. తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు. దీంతో సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన తండ్రి ఉపేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనకు సంతృప్తిగా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంతోష్‌కు పరమ్ వీర్ చక్ర అవార్డును ప్రకటించాల్సి ఉందని అన్నారు. తన కుమారుడు చూపిన ధైర్య సాహసాలు ఎంతోమంది రక్షణ సిబ్బందిని ప్రభావితం చేశాయని అయన చెప్పారు. చైనా కన్నా ఇండియా శక్తిమంతమైన దేశమని తన కుమారుడు రుజువు చేశాడని ఉపేంద్ర అన్నారు.

Tags:    

Similar News