భోపాల్ ఘటనపై సిరీస్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది. భోపాల్ దుర్ఘటనకు 36 ఏళ్లు పూర్తి కాగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు నిర్మాత రోనీ స్క్రూవాలా. డామినిక్యూ లాపియర్ మరియు జావియర్ మోరో రచించిన ‘ఫైవ్ పాస్ట్ మిడ్‌నైట్ ఇన్ భోపాల్’ పుస్తకం ఆధారంగా సిరీస్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే ఘోరమైన పారిశ్రామిక విపత్తు కథను వివరిస్తూ సాగిన ఈ పుస్తకం 1997లో ఫస్ట్ టైమ్ పబ్లిష్ అయింది. మూడేళ్లపాటు […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది. భోపాల్ దుర్ఘటనకు 36 ఏళ్లు పూర్తి కాగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు నిర్మాత రోనీ స్క్రూవాలా. డామినిక్యూ లాపియర్ మరియు జావియర్ మోరో రచించిన ‘ఫైవ్ పాస్ట్ మిడ్‌నైట్ ఇన్ భోపాల్’ పుస్తకం ఆధారంగా సిరీస్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే ఘోరమైన పారిశ్రామిక విపత్తు కథను వివరిస్తూ సాగిన ఈ పుస్తకం 1997లో ఫస్ట్ టైమ్ పబ్లిష్ అయింది.
మూడేళ్లపాటు భోపాల్‌లోనే నివసించి పుస్తకం రాసిన రచయితలు..ఈ విపత్తుకు సాక్ష్య్ంగా నిలిచిన ఇండియా, అమెరికాకు చెందిన సాక్ష్యులను ఇంటర్వ్యూ చేసి వివరాలు కనుక్కున్నారు. ఈ అన్నిటి మేళవింపుగా వచ్చిన ‘ఫైవ్ పాస్ట్ మిడ్‌నైట్ ఇన్ భోపాల్’ బుక్.. కొంత మంది ఊరి ప్రజలు కరువు నుంచి తప్పించుకునేందుకు భోపాల్ వెళ్లి మురికివాడలో స్థిరపడటం నుంచి మొదలవుతుంది. ఇంతటి పెనుముప్పునకు కారణమైన యూనియన్ కార్బైడ్ కెమికల్ పెస్టిసైడ్ ‘సెవిన్’ (మిథైల్ ఐసోసయనేట్, ఆల్ఫా నాఫ్తాల్)ను ఇన్వెంట్ చేయడం గురించి కూడా ప్రస్తావించారు రచయితలు.
15 వేల నుంచి 30వేల మంది చావుకు కారణమైన విపత్తు జరిగిన రోజున..మురికివాడలో రాత్రి వివాహం చేసుకోబోయే ఒరియా అమ్మాయి పద్మిని, స్కాట్లాండ్‌కు చెందిన మిషనరీ సిస్టర్ ఫెలిసిటీ పాత్రలు పుస్తకంలో హైలెట్‌గా నిలుస్తాయి. పాయిజన్ క్లౌడ్ నుంచి రక్షణ కలిపించేందుకు టెంట్లను అద్దెకు తీసుకున్న వర్తకుడు, ట్రైన్ స్టేషన్‌లో ఆగకుండా ట్రై చేసే రైల్వే స్టేషన్ వార్డెన్ పాత్రల ద్వారా విపత్తు జరిగిన తీరు, తీవ్రతను వివరించారు. ఇక డిజాస్టర్‌లో భాగమైన అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్, భోపాల్ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ వారెన్ ఊమర్ క్యారెక్టర్స్ ఫైనల్ చాప్టర్‌లో పొందుపరిచారు రచయితలు.