‘హైక్’లో వర్చువల్ వరల్డ్
దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫ్లామ్ ‘హైక్’ ఓ ఇంటరెస్టింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్‌లో తొలిసారిగా వర్చువల్ వరల్డ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆ కంపెనీ బుధవారం ప్రకటించింది. ‘యువర్ హోమ్’ ‘బిగ్ స్క్రీన్’ అనే సోషల్ ఆబ్జెక్ట్‌తో వీటిని ప్రారంభించిన హైక్.. మెయిన్ అప్లికేషన్‌లోనే ‘హైక్ ల్యాండ్’ పేరుతో దీన్ని భారతీయ హైక్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అయితే హైక్ ల్యాండ్ ఫీచర్ పొందాలంటే.. […]
దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫ్లామ్ ‘హైక్’ ఓ ఇంటరెస్టింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్‌లో తొలిసారిగా వర్చువల్ వరల్డ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆ కంపెనీ బుధవారం ప్రకటించింది. ‘యువర్ హోమ్’ ‘బిగ్ స్క్రీన్’ అనే సోషల్ ఆబ్జెక్ట్‌తో వీటిని ప్రారంభించిన హైక్.. మెయిన్ అప్లికేషన్‌లోనే ‘హైక్ ల్యాండ్’ పేరుతో దీన్ని భారతీయ హైక్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అయితే హైక్ ల్యాండ్ ఫీచర్ పొందాలంటే.. ఓల్డ్ వెర్షన్ హైక్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
యువర్ హోమ్ :
యూజర్లు తమ స్నేహితులతో కలిసి హ్యాంగవుట్ చేయడానికి ఈ వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లోకి వారిని ఇన్‌వైట్ చేయొచ్చు. వారితో కలిసి వీడియోలు చూడొచ్చు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ వీడియోలు మాత్రమే కలిసి చూసే అవకాశం ఉండగా.. భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన వీడియోలను కూడా చూసే సౌకర్యం కల్పిస్తామని కంపెనీ సీఈవో తెలిపారు. హోమ్ ఎన్విరాన్‌మెంట్ చాలా ప్రైవసీతో కూడుకున్నదని, యూజర్ ఇన్విటేషన్ లేకుండా.. అందులోని వీడియోలు మరోకరు చూసే వీలుండదని వెల్లడించారు.
బిగ్ స్క్రీన్ :
ఇంకా చెప్పాలంటే ఇదో ‘మినీ థియేటర్’ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇతరులతో కలిసి వీడియోలను చూసే అవకాశం ఉంది. 24/7 యూ ట్యూబ్‌కు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉంటాయి. తమకు ఇష్టమైన వీడియోను ఇతరులకు పింగ్ చేయడంతో పాటు వాళ్లిద్దరూ కలిసి వీడియోలను చూడొచ్చు.