కేఏ పాల్ విదేశాల్లో ఉండి పిటిషన్‌ వేయవచ్చా?

దిశ వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. నిన్న ఏపీ వ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఈ బంద్‌కు బీజేపీ, జనసేన మినహా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ […]

Update: 2021-03-06 02:22 GMT

దిశ వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. నిన్న ఏపీ వ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఈ బంద్‌కు బీజేపీ, జనసేన మినహా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉన్న కేఏ పాల్.. తన జీపీఏ హోల్డర్ జ్యోతి బెగల్ ద్వారా ఈ పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు… ఈ సందర్భంగా పలు సందేహాలు వ్యక్తం చేసింది.

విదేశాల్లో ఉండి పిటిషన్ వేయవచ్చా?.. లేదా? అనే అంశంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేయగా.. రూల్ నంబర్ 4 ద్వారా పిటిషన్ వేయవచ్చని పాల్ తరపు న్యాయవాది బాలాజీ కోర్టుకు చెప్పారు. దీంతో ఈ విధంగా పిల్ వేయవచ్చా?.. లేదా? అనేది పరిశీలించేందుకు ఈ కేసును వారం పాటు హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News