కరీంనగర్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..
దిశ, కరీంనగర్ సిటీ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. నగరం నడిబొడ్డున గల ప్రధాన రహదారిపై హై టెన్షన్ కరెంట్ తీగ ఒక్కసారిగా తెగి పడింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని నిలిపివేయగా రెప్పపాటులో పెనుప్రమాదం తప్పింది. క్షణానికి పది వాహనాలు తిరిగే తెలంగాణ చౌక్‌లో గురువారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పవర్ సరఫరా చేసే వైరు ఒక్కసారిగా తెగి కిందకు వేలాడుతుంది. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న […]
దిశ, కరీంనగర్ సిటీ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. నగరం నడిబొడ్డున గల ప్రధాన రహదారిపై హై టెన్షన్ కరెంట్ తీగ ఒక్కసారిగా తెగి పడింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని నిలిపివేయగా రెప్పపాటులో పెనుప్రమాదం తప్పింది. క్షణానికి పది వాహనాలు తిరిగే తెలంగాణ చౌక్‌లో గురువారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పవర్ సరఫరా చేసే వైరు ఒక్కసారిగా తెగి కిందకు వేలాడుతుంది.
అదే సమయంలో అటు వైపుగా వస్తున్న బస్ డ్రైవర్ గమనించి వెంటనే బస్సును నిలిపివేశాడు. ఈ విషయాన్ని సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు వివరించగా, ఆయన విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన విద్యుత్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విద్యుత్ తీగలను సరిచేశారు.