ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా ఐదేళ్ల క్రితం అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో గురువారం హైటెన్షన్ నెలకొంది. ఒకే రాజధానిని డిమాండ్ చేస్తూ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి పరిరక్షణ జేఏసీ నిరసన కార్యక్రమాలు చేపట్టగా, కొద్దిసేపటికే మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ కొందరు రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో జేఏసీ నేతలు నిరసన కార్యక్రమం ముగించుకొని వెళ్లాలని, మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు వస్తారని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో పోలీసులపై […]
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా ఐదేళ్ల క్రితం అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో గురువారం హైటెన్షన్ నెలకొంది. ఒకే రాజధానిని డిమాండ్ చేస్తూ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి పరిరక్షణ జేఏసీ నిరసన కార్యక్రమాలు చేపట్టగా, కొద్దిసేపటికే మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ కొందరు రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో జేఏసీ నేతలు నిరసన కార్యక్రమం ముగించుకొని వెళ్లాలని, మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు వస్తారని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో పోలీసులపై మండిపడిన రైతులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే వారికి ఎలా అనుమతి ఇస్తారని నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.