విద్యాశాఖకు హైకోర్టు హెచ్చరిక

దిశ,వెబ్‌డెస్క్: ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిల్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిల్ పై సీజే ఆద్వర్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. కాగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు హై కోర్టుకు ఉన్నత విద్యామండలి తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని కోర్టుకు చెప్పింది. ఉన్నత విద్యామండలి సమాధానంపై హై కోర్టు అసహనం […]

Update: 2021-01-18 06:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిల్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిల్ పై సీజే ఆద్వర్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. కాగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు హై కోర్టుకు ఉన్నత విద్యామండలి తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని కోర్టుకు చెప్పింది. ఉన్నత విద్యామండలి సమాధానంపై హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. లేఖ రాసి 10 రోజులైనా నిర్ణయం తీసుకోలేదా అని ప్రశ్నించింది. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక సీఎస్‌కు జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..