ఆ తేదీ వరకు పరిణామాలనే పరిశీలిస్తాం : హైకోర్టు

దిశ,వెబ్ డెస్క్: ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిల్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫీజులపై జీవో 46 ఉల్లంఘన జరుగుతోందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి తరగతులను నిర్వహిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కాగా జనవరి 31 వరకు జరిగిన పరిణామాలనే పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. పాఠశాలలు తెరిచాక కూడా ఇతర ఫీజులు తీసుకోరాదా […]

Update: 2021-01-22 05:33 GMT

దిశ,వెబ్ డెస్క్: ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిల్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫీజులపై జీవో 46 ఉల్లంఘన జరుగుతోందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి తరగతులను నిర్వహిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కాగా జనవరి 31 వరకు జరిగిన పరిణామాలనే పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. పాఠశాలలు తెరిచాక కూడా ఇతర ఫీజులు తీసుకోరాదా అని ప్రశ్నించింది. దీనికి జీవో నెం 46 ప్రకారం బోధనా రుసుము మాత్రమే తీసుకోవాలని కోర్టకు పిటిషనర్ చెప్పారు. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు హై కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News