బోనాలకు హైకోర్టు స్పెషల్ పర్మిషన్

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని సిటీ సివిల్ కోర్టు సిబ్బందికి హైకోర్టు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా సోమవారం మధ్యాహ్నానికే విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళొచ్చని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. కోర్టు ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కేవలం సిటీ సివిల్ కోర్టుకు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని సబార్డినేట్ కోర్టులకూ ఈ అవకాశాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. యథావిధిగా సోమవారం ఉదయం విధులకు హాజరయ్యే […]

Update: 2021-08-01 10:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని సిటీ సివిల్ కోర్టు సిబ్బందికి హైకోర్టు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా సోమవారం మధ్యాహ్నానికే విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళొచ్చని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. కోర్టు ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కేవలం సిటీ సివిల్ కోర్టుకు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని సబార్డినేట్ కోర్టులకూ ఈ అవకాశాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.

యథావిధిగా సోమవారం ఉదయం విధులకు హాజరయ్యే జ్యుడిషియల్ సిబ్బంది మధ్యాహ్నం 1.15 గంటల వరకే డ్యూటీ చేస్తారని, 1.30 గంటల నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నందువల్ల పనులకు ఆటంకం లేకుండా ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 2వ తేదీకి మాత్రమే ఈ అవకాశం పరిమితమవుతుందని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..