దళితబంధు పథకంపై పిటిషనర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్ : దళతబంధు పథకంపై దాఖలైన పిటిషన్‌ను విచారిచలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని జనవాహిని, జైస్వారాజ్ తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. పీటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ప్రతివాదులుగా చేర్చారు. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది […]
దిశ, వెబ్‌డెస్క్ : దళతబంధు పథకంపై దాఖలైన పిటిషన్‌ను విచారిచలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని జనవాహిని, జైస్వారాజ్ తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. పీటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ప్రతివాదులుగా చేర్చారు. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దానికి తెలంగాణ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యవసరంగా విచారించలేమని లిస్ట్ ప్రకారం విచారిస్తామని తెలిపింది.