‘TSPSC’ని మూసేయండి.. హైకోర్టు సీరియస్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించిన హైకోర్టు దాన్ని మూసేయాలనే ఉద్దేశం ఉందా అని వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా ఛైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశాలు జారీ చేసి నియమించినట్లు తెలియజేసే నివేదికను హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోనే ఈ నియామకాలు జరగాలని ఆదేశించింది. వెంటనే పూర్తిస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించిన హైకోర్టు దాన్ని మూసేయాలనే ఉద్దేశం ఉందా అని వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా ఛైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశాలు జారీ చేసి నియమించినట్లు తెలియజేసే నివేదికను హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోనే ఈ నియామకాలు జరగాలని ఆదేశించింది. వెంటనే పూర్తిస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు స్పష్టం చేశారు.
నిరుద్యోగి శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే సభ్యులుగా ఉన్నారని, నిరుద్యోగులు ఎంతగానో కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, పూర్తిస్థాయి కమిషన్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పని సాధ్యం కావడంలేదని, ఛైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగేలా హైకోర్టు చొరవ తీసుకోవాలని ఆ పిటిషన్‌లో శంకర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు, కమిషన్‌లో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని నిలదీసి ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని స్పష్టం చేసింది.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ముఖ్యమైన విభాగం.. దానికి ఛైర్మన్, సభ్యులను నియమించకపోతే కొనసాగించడమెందుకు అని ప్రశ్నించింది. నిజంగా మూసివేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఆ పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ చైర్మన్, సభ్యులను నియమించే ఆలోచన లేనట్లయితే కమిషన్‌ను పూర్తిగా మూసివేయాలని సూచించింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను ముగించి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.