టీటీడీ ఆస్తులపై హైకోర్టు కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆస్తులపై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారించిన ధర్మాసనం.. వెబ్‌సైట్‌లో పెట్టిన దేవస్థానం ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు అందించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలన్నీ ఐదు రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ తీసుకున్న చర్యలను అఫిడవిట్‌లో తెలపాలని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ ఐదు రోజులకు వాయిదా […]

Update: 2021-02-25 02:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆస్తులపై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారించిన ధర్మాసనం.. వెబ్‌సైట్‌లో పెట్టిన దేవస్థానం ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు అందించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలన్నీ ఐదు రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ తీసుకున్న చర్యలను అఫిడవిట్‌లో తెలపాలని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ ఐదు రోజులకు వాయిదా వేసింది.

టీటీడీకి చెందిన ఆస్తుల విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. టీటీడీకి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయంపై శ్వేతప్రతం విడుదల చేయాలని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, సంఘాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News