మన్మోహన్‌సింగ్ కన్నుమూత.. ఢిల్లీకి సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కు సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించనున్నారు...
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్(Former Prime Minister of India Manmohan Singh) కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS)లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈ మేరకు మన్మోహన్ సింగ్‌కు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) కూడా మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. మన్మోహన్ మృతి పట్ల ఇప్పటికే ట్విట్టర్ ద్వారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.